Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుల్‌భూషణ్‌కు మరణశిక్షా? తప్పు చేశాడా? ఆధారాలేవి? ముందుకెళ్తే అంతే సంగతులు: సుష్మా స్వరాజ్

పాకిస్థాన్ వైఖరిపై భారతదేశ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఏకిపారేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా విద్రోహానికి, గూఢచార్యానికి పాల్పడారనే ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్

Advertiesment
కుల్‌భూషణ్‌కు మరణశిక్షా? తప్పు చేశాడా? ఆధారాలేవి? ముందుకెళ్తే అంతే సంగతులు: సుష్మా స్వరాజ్
, మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (12:59 IST)
పాకిస్థాన్ వైఖరిపై భారతదేశ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఏకిపారేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా విద్రోహానికి, గూఢచార్యానికి పాల్పడారనే ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధంచిన సంగతి తెలిసిందే. ఈ మరణ శిక్షపై భారత్ మండిపడింది. ఢిల్లీలోని పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తన కార్యాలయానికి పిలిపించుకొని తీవ్ర నిరసన తెలిపారు. 
 
మరోవైపు జాదవ్ మరణశిక్ష విధించి.. పాకిస్థాన్ అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిని భారతదేశ పార్లమెంటు ఏకగ్రీవంగా ఖండించింది. కుల్‌భూషణ్ జాదవ్‌పై తప్పుడు ఆరోపణలతో విచారణ జరిపి, ఆయనకు మరణ శిక్ష విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పార్లమెంట్‌లో ఎంపీలంతా ఏకమై పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ మాట్లాడుతూ యావత్తు దేశం కుల్‌భూషణ్‌కు మద్దతుగా నిలుస్తోందన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ భారత ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ ఇస్లామాబాద్‌లో పర్యటించినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేదని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికిగల పలుకుబడిని ఉపయోగించి పాకిస్థాన్‌ను ఎండగట్టాలన్నారు. 
 
కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ అక్రమంగా శిక్ష విధించడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ.. కుల్‌భూషణ్ జాదవ్ తప్పు చేసినట్లు రుజువు చేసే సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేశారు. ఆయనకు మరణ శిక్ష విధించడం ముందుగా ప్రణాళిక రచించి హత్య చేయడమేనని ఆరోపించారు. ఈ విషయంలో పాకిస్థాన్ మరింత ముందుకెళ్తే.. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కుల్‌భూషణ్‌కు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 
 
కుల్‌భూషణ్ జాదవ్‌కు న్యాయం చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటు సమైక్యంగా గళమెత్తి, ఆయనను కాపాడి, తిరిగి భారతదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ జాదవ్‌కు పాకిస్థాన్ మరణ శిక్ష విధించడాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మౌలిక న్యాయ సూత్రాలు, చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని తెలిపారు. జాదవ్‌కు న్యాయం జరిగేందుకు సాధ్యమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని సభకు హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓవరాక్షన్.. నోట్లో రక్తం కారుతున్నా లాక్కెళ్లారు.. విమానం నుంచి దించేశారు.. (వీడియో)