Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తాం..

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉండి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది హిజ్బుల్ సంస్థ. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్‌కు చెందిన నాయకులను తీవ్రంగా హెచ్చిరిస్తూ హిజ్బుల్ ముజాహిదిన్‌కు చెందిన ఉగ్రవా

Advertiesment
ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తాం..
, ఆదివారం, 14 మే 2017 (10:24 IST)
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉండి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది హిజ్బుల్ సంస్థ. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్‌కు చెందిన నాయకులను తీవ్రంగా హెచ్చిరిస్తూ హిజ్బుల్ ముజాహిదిన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జాకీర్ మూసా ఒక సంచలన ఆడియో టేప్ పోస్టు చేశాడు. తాము చేస్తున్న ఇస్లాం స్థాపన ఉద్యమానికి హుర్రియత్ నేతలు అడ్డువస్తే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. 
 
తాము చేపట్టిన ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తానంటూ హెచ్చరించాడు. అయితే ఈ వ్యాఖ్యలకు నిర్ఘాంతపోయిన హిజ్బుల్ నేతలు మూసా ప్రకటనకు తమకు ఎలాంటి సంబంధంలేదని ప్రకటన విడుదల చేశారు.
 
మూసా వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని ఆ ప్రకటనతో తమకు ఎలాంటి బాద్యతలేదని హిజ్బుల్ అధికార ప్రతినిధి సలీం హష్మీ స్సందించారు. గందరగోళం సృష్టించే ఏ ప్రకటన అయినా పోరాటాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైనాన్స్ వ్యవహారం.. డబ్బు కోసం రమ్మని కడుపులో పొడిచేశాడు..