Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యంపై ఉత్కంఠ.. మళ్లీ విషమం?

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యంపై మళ్ళీ ఉత్కంఠత నెలకొంది. ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో డీఎంకే నేతలు, కార్యకర్తలు కరుణానిధి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పరుగులు తీస్త

Advertiesment
Karunanidhi Health condition serious
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:43 IST)
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యంపై మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో డీఎంకే నేతలు, కార్యకర్తలు కరుణానిధి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. 93 యేళ్ల కరుణానిధికి గొంతు, ఊపిరితిత్తుల్లో ఇనఫెక్షన్ చేరడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చెన్నైలోని కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెల్సిందే. ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు 'ట్రక్యోస్టమీ' (కృత్రిమశ్వాస అందించే పరికరం) అమర్చి చికిత్స అందించారు. 
 
వాస్తవానికి కరుణానిధికి ఏమైందన్న చర్చ డీఎంకే శ్రేణుల్లో సాగుతోంది. మందులు వికటించడంతో ఇంటిపట్టునే చికిత్స పొందిన కరుణానిధి గత కొంతకాలంగా ఆహారం తీసుకోలేకపోతున్నారు. 15 రోజులుగా వైద్యులు 'రెయిల్స్‌ ట్యూబ్‌' ద్వారా కేవలం ద్రవపదార్థాలను ఆహారంగా అందిస్తున్నారు. అంతేకాదు ఆయనకు దీనికి తోడు గొంతులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో రెయిల్స్‌ ట్యూబ్‌ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తేల్చిన వైద్యులు.. గంటగంటకూ నీరసపడుతున్న కరుణను తక్షణం ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు సూచించగా, హుటుహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు సీనియర్‌ డాక్టర్‌ కార్తీక్‌రాజా నేతృత్వంలోని వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెపుతూ రాగా.. ఇపుడు ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గ్రామంలో అందరూ కోటీశ్వరులే.. వ్యాపారంతో కాదు.. వ్యవసాయంతో పైకొచ్చారు...