కర్ణాటకలోకి హాసన్ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ యువతి ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకంపై మీటూ అంటూ సెల్ఫీ వీడియోను తీసి ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పోస్ట్ చేసింది. ఆ పోస్టు విస్తృతంగా షేర్ అవుతోంది. రిటైర్డ్ అయ్యే వయసులో ఉన్న అతను ఒక్క ముద్దు పెడితే రూ.15 వేలు, పిలిచినపుడు వస్తే అడిగినంత ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హాసన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తన పేరు వెల్లడించకుండా మీటూ ఉద్యమ స్ఫూర్తితో తనకు ఎదురైన లైంగిక అనుభవాన్ని వెల్లడించింది. హాసన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కృష్ణేగౌడ ఉద్వోగం ఇప్పినంటూ నమ్మించి తన మొబైల్ నంబర్‌ను తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది.
ముద్దుకు ఒక రేటు, పిలిచిన్నప్పుడు వస్తే అడిగినంత డబ్బులు ఇస్తానంటూ తనపై ఒత్తిడి చేసిన్నట్లు గోడును వెళ్లబోసుకుంది. పత్రికలు, టీవీలో వస్తున్న మీటూ ఉద్యమం స్ఫూర్తితో తన బాధను వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. కామాంధునిపై చర్యలకు జిల్లా ఎస్‌పీ ప్రకాశ్‌గౌడ సాయం కావాలని, కృష్ణేగౌడ వంటి కీచకుడికి చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రిటైరయ్యే వయస్సులోనున్న అతడు.. రూ.15 వేలు ఇస్తా, ఒక ముద్దు పెట్టించుకోవాలని తనను వేధించినట్టు ఆమె వెల్లడించింది.