కర్నాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన పెద్దలు ఢిల్లీలో సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇటు డీకే శివకుమార్, అటు సిద్ధరామయ్యలు పట్టువీడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటక సీఎం చేయాలని రాష్ట్ర ఎస్సీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు. అలా చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణలు కూడా వినిపిస్తుండటం గమనార్హం. అలాగే, మరో దళిత నేత పరమేశ్వరను కూడా సీఎం చేయాలని వారు కోరుతున్నారు.