Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగారెందుకు కుమారా? జేడీఎస్ విప్‌కు విలువలేదు : యడ్యూరప్ప

Advertiesment
Karnataka floor test
, ఆదివారం, 21 జులై 2019 (13:31 IST)
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ప్రభుత్వ మనుగడ సోమవారంతో తేలిపోనుంది. ప్రస్తుతం సీఎం కుమార స్వామి ప్రవేశపెట్టి విశ్వాసతీర్మానంపై చర్చ సాగుతూ ఉంది. గత రెండు రోజులు పాటు చర్చ సాగినప్పటికీ అది తెరపడలేదు. పైగా, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీంతో సభ క్రమం తప్పుతోంది. దీన్ని సాగుగా చూపిన సభాపతి సభ ఆర్డర్‌లో లేదంటూ సభను వాయిదావేస్తూ వస్తున్నారు. 
 
ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప స్పందిస్తూ, ముఖ్యమంత్రి అయివుండి ప్రజాస్వామ్య విలువలకు కుమారస్వామి తిలోదకాలిస్తున్నారని, కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌కు విలువలేదన్నారు. రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా విప్‌ జారీ చేయడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. అన్ని ప్రశ్నలకు రేపు సమాధానం దొరుకుతుందని, సీఎం కుమారస్వామి, సీఎల్పినేత సిద్ధరామయ్య వాటికి సిద్ధంగా ఉండాలని సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. కుమార స్వామి ప్రభుత్వానికి రేపే చివరి రోజు అని యడ్యూరప్ప జోస్యం చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహం ప్రాణం తీసిన పక్షవాతం...