Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడ మూత్రమే తీర్థం... నగ్నంగా ఊరేగింపు.. మగబిడ్డ పుట్టాలంటే...

ఎన్ని రాకెట్లు ప్రయోగించినా, ఎంత పురోగతి సాధించినా ఆకాశంలో సగం అని కీర్తించే స్త్రీలకు సమాజంలో వివక్ష అడుగడుగునా ఎదురవుతూనే ఉంది. భద్రత కోసమో, సమాజంలో ఆడవారిపై నేడు జరుగుతున్న ఆకృత్యాల ఫలితమో కానీ మగబ

Advertiesment
అక్కడ మూత్రమే తీర్థం... నగ్నంగా ఊరేగింపు.. మగబిడ్డ పుట్టాలంటే...
, బుధవారం, 10 మే 2017 (11:26 IST)
ఎన్ని రాకెట్లు ప్రయోగించినా, ఎంత పురోగతి సాధించినా ఆకాశంలో సగం అని కీర్తించే స్త్రీలకు సమాజంలో వివక్ష అడుగడుగునా ఎదురవుతూనే ఉంది. భద్రత కోసమో, సమాజంలో ఆడవారిపై నేడు జరుగుతున్న ఆకృత్యాల ఫలితమో కానీ మగబిడ్డ పుట్టాలని కోరుకునే వారి సంఖ్య మాత్రం భారతదేశంలో ఏ మాత్రం తగ్గడం లేదు. సహజంగానే మన ఆధీనంలో లేని విషయాలకు దేవునిపై భారం వేసేసి, ముడుపులు చెల్లించి గుళ్లు గోపురాలు తిరగడమే తరతరాలుగా మనకు అలవాటు. కానీ వింత మొక్కులు మాత్రమే కాదు.. వింత ఆచారాలూ వెలుగులోకొస్తున్నాయి.
 
ఓ బాలుడిని నగ్నంగా నిచ్చెనపై కూర్చోబెట్టి ఊరేగింపు చేసి, ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకురాగానే అతని మూత్రాన్ని సేకరించి, దాన్ని తీర్థంలా చల్లుకుంటే తప్పకుండా మగబిడ్డ పుడతాడనేది కర్ణాటకలోని డింక అనే గ్రామంలోని వింత ఆచారం. అంతే కాకుండా ఈ తంతు ముగిసాక, నిచ్చెన హనుమంతుగా పిలిచే ఆ బాలుడు రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి వంటి అనేక విషయాలతో భవిష్యవాణి సైతం వినిపిస్తాడు. మీకూ నమ్మకం కుదిరితే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉన్న డింక గ్రామానికి ఓసారి వెళ్లొచ్చేయండి... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య విడాకులు ఇవ్వలేదనీ.. తుపాకీతో ఇద్దరిని కాల్చివేసిన శాడిస్ట్ భర్త