Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యేడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారు : కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మాటలదాడి చేశారు. కేజ్రీవాల్‌.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానిక

Advertiesment
యేడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారు : కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా
, బుధవారం, 17 మే 2017 (13:37 IST)
ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మాటలదాడి చేశారు. కేజ్రీవాల్‌.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విటర్‌ ద్వారా కామెంట్స్‌ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్‌ నేతలు భయపడుతున్నారని.. వారికి కేజ్రీవాల్‌ ధైర్యం చెప్తున్నారంటూ పోస్ట్ చేశారు. 
 
"ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు మరో 15 రోజుల్లో మర్చిపోతారు. వారికి భయపడకండి అని కేజ్రీవాల్‌ ఆప్‌ నేతలకు చెబుతున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరు మాత్రమే చాలా తక్కువగా ఉంది. కార్యాలయానికి వెళ్లకుండా, మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. అంతేకాదు ఎక్కువగా సెలవులు పెడుతూ అవినీతి కేసులు ఉన్న సీఎం కూడా కేజ్రీవాలే" అంటూ విమర్శలు చేశారు. 
 
ఢిల్లీ నగర పాలక సంస్థకు అవసరమైన మంచినీటి ట్యాంకర్లను కొనుగోలు చేసే విషయంపై డొల్ల కంపెనీల ద్వారా సీఎం కేజ్రీవాల్‌ రూ.2 కోట్లు లంచం తీసుకోవడం తాను కళ్లారా చూశానని కపిల్‌ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా.. ఈ విషయమై మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ నేతలపై ప్రధానికి కక్ష్య.. ఎందుకు..!