Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంగనా కారుకూతలతో మాకు సంబంధం లేదు : బీజేపీ - యూ టర్న్ తీసుకున్న బాలీవుడ్ నటి

Kangana Ranaut

ఠాగూర్

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (12:44 IST)
సాగు చట్టాలను వెనక్కి తీసుకుని రావాలంటూ బాలీవుడ్ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్ అన్నారు. ఇదేవిషయంపై జయవీర్ మాట్లాడుతూ, కంగనా రనౌత్ చేస్తున్న నిరాధారమైన అర్థంపర్థం లేని వ్యాఖ్యలన్నారు. 'సిక్కు సామాజికవర్గం, పంజాబ్ రైతులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తర్కవిరుద్ధం. పంజాబ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి కంగన తీరు విఘాతం కలిగిస్తోంది' అని ఆయన స్పష్టం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన కంగనా తీరును తీవ్రంగా ఎండగట్టారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగన చెప్పడాన్ని తప్పుబట్టారు. 'కంగనా కారుకూతలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యం' అని దుయ్యబట్టారు. సొంత పార్టీ బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండడంతో కంగన నష్టనివారణ చర్యలను ప్రారం భించారు. 'నా వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇకపై నేను పార్టీ అభిప్రాయాల మేరకు మాట్లాడతాను' అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా.. 'కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ విధానాన్ని ప్రతిబింబించబోవు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, కంగనా వ్యాఖ్యలపై ఏఐ 'కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. 750 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా రైతు వ్యతిరేక బీజేపీ, మోడీ ప్రభుత్వంలో మార్పురాలేదు" అన్నారు. హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ సాక్షిగా రైతులను ఆందోళన జీవులు, పరాన్నజీవులు అన్న విషయాన్ని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన పార్టీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స సోదరుడు