Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యాట్సాఫ్ పన్నీర్ సార్... సెల్వం ధైర్యాన్ని కొనియాడుతూ కమల్, ఖుష్బూ ట్వీట్స్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి అనూహ్యంగా సినీ ప్రముఖుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటి

హ్యాట్సాఫ్ పన్నీర్ సార్... సెల్వం ధైర్యాన్ని కొనియాడుతూ కమల్, ఖుష్బూ ట్వీట్స్
, బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (17:30 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి అనూహ్యంగా సినీ ప్రముఖుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు పన్నీర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇపుడు పలువురు సినీ నటులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 
మంగళవారం రాత్రి మెరీనా తీరంలోని ‘అమ్మ’ జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు ధ్యానం చేసిన అనంతరం, జయలలిత మృతి, తన రాజీనామా గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పన్నీరు సెల్వంను తమిళ సినీనటులు కొనియాడారు. 
 
ముఖ్యంగా ప్రముఖ నటుడు కమల హాసన్ స్పందిస్తూ, 'తమిళనాడు ప్రజలారా, త్వరగా నిద్రపోండి, రేపు వాళ్లు మనకంటే ముందే నిద్ర లేస్తారు' అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ కూడా తనదైనశైలిలో స్పందించారు. మౌనాన్ని వీడిన ఓపీఎస్, ఒక హీరోగా ముందుకొచ్చారని, ఇప్పుడే డ్రామా మొదలైందని వ్యాఖ్యానించారు. 
 
56 అంగుళాల ఛాతి ఉన్న నేత తరపున ఓపీఎస్ పనిచేయడం లేదని తాను ఆశిస్తున్నట్లు ఖష్బూ పేర్కొంది. ఓపీఎస్ సార్, సరైన సమయంలో గొప్పగా, ధైర్యంగా మాట్లాడారని, ఆయనకు హాట్సాప్ అని యువనటుడు ఆర్య అన్నాడు. మరో నటుడు అరవిందస్వామి చెబుతూ.. 'బఠానీలు తింటూ న్యూస్ చూస్తున్నాను, ఉప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది, ఇక, పాప్‌కార్న్ తింటా'నని అన్నాడు. 
 
దక్షిణాది నటుడు సిద్ధార్థ స్పందిస్తూ.. మెరీనాలో ఓపీఎస్, తమిళనాడు రాజకీయాలు హాలీవుడ్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థోర్న్స్’, హాలీవుడ్ మూవీ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను తలపిస్తున్నాయన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు ఓపీఎస్ స్ట్రోక్ : క్యాంపు పాలిటిక్స్... 130 మంది ఎమ్మెల్యేల కిడ్నాప్... ఫోన్లు స్వాధీనం