Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్ హాసన్ రెడీ.. 26 నుంచి రాష్ట్ర పర్యటన.. ప్రజా సమస్యల కోసం..

రాజకీయాల్లో రావడం ఖాయమని చెప్పేసిన విలక్షణ నటుడు కమలహాసన్.. పార్టీ పేరును ప్రకటించక ముందే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని తన అభిమానుల సమక్షంలో

Advertiesment
కమల్ హాసన్ రెడీ.. 26 నుంచి రాష్ట్ర పర్యటన.. ప్రజా సమస్యల కోసం..
, సోమవారం, 15 జనవరి 2018 (17:38 IST)
రాజకీయాల్లో రావడం ఖాయమని చెప్పేసిన విలక్షణ నటుడు కమలహాసన్.. పార్టీ పేరును ప్రకటించక ముందే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని తన అభిమానుల సమక్షంలో వెల్లడించిన నేపథ్యంలో, కమల్ హాసన్ రాజకీయ ప్రకటన కంటే ముందుగానే రంగంలోకి దిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోందని, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలను ప్రజలకు విస్తరిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. జనవరి 26న తన పర్యటన మొదలవుతుందని చెప్పారు. మైయ్యామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయని చెప్పారు. త్వరలోనే అవినీతి తిమింగళాల బండారాన్ని బయటపెడతానని తెలిపారు. 
 
మరోవైపు తాను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పార్టీ పెడతా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని తమిళ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశంపై ఉన్న ఉత్కంఠకు ఆయన 2017వ సంవత్సరం చివరి రోజున (డిసెంబర్ 31న) తెరదించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ఆపాలి- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి