Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్టీస్ కర్ణన్ కనిపించడం లేదు... సుప్రీంకోర్టు అరెస్టు ఉత్తర్వులతో అజ్ఞాతంలోకి..

కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కనిపించడం లేదు. కోర్టు ధిక్కార నేరం కింద ఆయనకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా, జస్టిస్ కర్ణన్ ప్రకటనలు మ

Advertiesment
జస్టీస్ కర్ణన్ కనిపించడం లేదు... సుప్రీంకోర్టు అరెస్టు ఉత్తర్వులతో అజ్ఞాతంలోకి..
, గురువారం, 11 మే 2017 (11:57 IST)
కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కనిపించడం లేదు. కోర్టు ధిక్కార నేరం కింద ఆయనకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా, జస్టిస్ కర్ణన్ ప్రకటనలు మీడియా ప్రచురించరాదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏంచేయాలో తెలియని జస్టిస్ కర్ణన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
కోర్టు ధిక్కారంకేసులో జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీం కోర్టు మంగళవారం జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయనను అదుపులోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో, పశ్చిమ బెంగాల్‌ డీజీపీ సురజితకర్‌ పుర్కయస్త నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం బుధవారం చెన్నైకి వచ్చింది. ఈ పోలీసులు బుధవారం రోజంతా చెన్నై, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చుట్టుపక్కల వేట కొనసాగించారు. అయినా, ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. 
 
ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం చెన్నై పోలీసు కమిషనర్‌ను కలుసుకుని కర్ణన్ అరెస్టుపై చర్చించింది. న్యాయపరమైన అంశాలను చర్చించింది. అయితే, జస్టిస్‌ కర్ణన్ ఎక్కడున్నారో తెలియకపోవడంతో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. నిజానికి, జస్టిస్‌ కర్ణన్ గత మంగళవారం చెన్నైకి చేరుకుని చేపాక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. 
 
సుప్రీం ఆదేశాలు వెలువడిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం అక్కడే మీడియాతోనూ మాట్లాడారు. బుధవారం ఉదయం బయటకు వెళ్లిపోయారు. బిల్లు చెల్లించకపోవడంతో ఆయన మళ్లీ తిరిగి రావొచ్చని భావించారు. కానీ, ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం కోల్‌కతా పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిషిత్ అంత్యక్రియలు పూర్తి.. : ఏ తండ్రికీ రాకూడదు: నారాయణ