సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇస్తా.. ఓ మంత్రికి కాదు.. గొప్ప మనసున్న మహిళకు.. జోధ్‌పూర్ రైతు
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండ
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండటం వల్లే తాను కిడ్నీ ఇవ్వడం లేదనీ, ఆమెకున్న గొప్ప మనసును చూసి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు.
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సుష్మా స్వరాజ్‌కు ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యశాలలో డయాలిసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ఆమెపై అభిమానం ఉన్న పలువురు కిడ్నీ దానం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో జోధ్‌పూర్‌కు సమీపంలోని ఎకలఖోరి అనే ప్రాంతానికి చెందిన రైతు కూడా ఉన్నారు. అతని పేరు వైషేక్ విష్ణోయి
'ఆపదలో ఉన్నవారు సహాయం కావాలంటే ఆమె వెంటనే స్పందిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోతారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులను రక్షించే విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నిబద్ధత, సహాయం చేసే గొప్ప మనసు ఆమె సొంతం. అందుకే ఆమెకు నా కిడ్నీ దానం చేస్తా..' అని ఆయన చెప్పుకొచ్చారు.