Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్ యువకుడి కాల్చివేత : జేడీయూ నేత కుమారుడి అరెస్టు

బీహార్ యువకుడి కాల్చివేత : జేడీయూ నేత కుమారుడి అరెస్టు
, మంగళవారం, 10 మే 2016 (09:50 IST)
తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న అక్కసుతో 19 యేళ్ల యువకుడిని కాల్చివేసిన కేసులో బీహార్ అధికార పార్టీ జేడీయు నేత కుమారుడిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 
 
గయలో రెండు రోజుల క్రితం జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవీ కుమారుడు రాకీ యాదవ్ ఆదిత్య కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 19 యేళ్ల సచ్‌దేవ్ యాదవ్ కారులో వెళుతూ రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రాకీ... తుపాకీతో సచ్‌దేవ్‌ను కాల్చి చంపాడు. 
 
ఈ కేసులో నిందితుడు రాకీ యాదవ్‌ను బోధ్‌గయలోని తండ్రి బిందియాదవ్ నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను కాల్చేందుకు వాడిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి తల్లిని పోలీసులు ప్రశ్నించారు. ఆదిత్య కారును ఓవర్‌టేక్ చేసి వెళ్లినందుకు రాకీ కాల్పులు జరిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్ ఓ బచ్చా.. వాళ్ల నాయన మాట్లాడితే స్పందిస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి