Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీవీ నుంచి జయలలిత వరకు అదే కంపెనీ.. ఆ శవపేటిక ప్రత్యేకత ఏంటో తెలుసా?

మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగ

Advertiesment
పీవీ నుంచి జయలలిత వరకు అదే కంపెనీ.. ఆ శవపేటిక ప్రత్యేకత ఏంటో తెలుసా?
, బుధవారం, 7 డిశెంబరు 2016 (12:04 IST)
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగా, ఈ శవపేటికలో ఉంచిన పార్థివదేహం మూడు నాలుగు రోజుల పాటు చెడిపోకుండా ఉంచడం దీని ప్రత్యేకత. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అండ్‌ హోమేజ్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.
 
ఈ పేటికలోపల 0 నుంచి 5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదు. ఈ శవపేటిక ప్రత్యేకత అని ఆ కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌, మనోరమ వంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది.
 
'జయలలిత కోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్‌, ఫ్రీజర్‌ బాక్స్‌ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది' అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పీఆర్‌ఎంఎం శాంతకుమార్‌ తెలిపారు. 1994లో పేటికలను తయారు చేసే లైసెన్సులు పొందిన తాము ఇప్పటివరకు 500 మంది ప్రముఖుల కోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చామని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయమ్మ అంత్యక్రియల్లో నటరాజన్ ఓవరాక్షన్.. ఏడీఎంకేలో శశికళతో కలిసి చక్రం తిప్పుతారా? ఓపీ పరిస్థితి?