Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా మేనత్త జయలలితను శశికళే హతమార్చింది : దీప సంచలన ఆరోపణలు

మా మేనత్త జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు చికిత్స కోసం ఆస్పత్రి పత్రాల్లో ఎవరు సంతకాలు చేశారని జయలలిత మేనకోడలు జయ దీపా ప్రశ్నించారు. ఆ పత్రాలపై సంతకాలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని ఆమె డిమ

Advertiesment
Jayalalithaa's niece Deepa Jayakumar
, గురువారం, 9 మార్చి 2017 (09:12 IST)
మా మేనత్త జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు చికిత్స కోసం ఆస్పత్రి పత్రాల్లో ఎవరు సంతకాలు చేశారని జయలలిత మేనకోడలు జయ దీపా ప్రశ్నించారు. ఆ పత్రాలపై సంతకాలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంలో పలు సందేహాలు, అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై అన్నాడీఎంకేలో రాజకీయాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జయలలిత ఆస్పత్రిలో చేరిన తరువాత చికిత్స కోసం ఆస్పత్రి పత్రాల్లో ఎవరు సంతకాలు చేశారో బహిర్గతం చేయాలని ఆమె మేనకోడలు దీప డిమాండ్‌ చేశారు. 
 
జయకు ఎక్మో వంటి చికిత్సలు అందించేందుకు ఆమె బంధువుల సంతకాలు తీసుకున్నామంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీప.. కొన్ని సందేహాలను లేవదీశారు. జయ మృతిపై పలు అనుమానాలున్నాయని, ఇప్పటికీ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. జయ మృతిపై ప్రభుత్వం చెప్పిన మాటల్లో పలు అనుమానాలున్నాయన్నారు. 
 
జయకు రక్త సంబంధీకులుగా తాను, తన సోదరుడు దీపక్‌ మాత్రమే వున్నామని, తామిద్దరం ఆస్పత్రి పత్రాల్లో ఎలాంటి సంతకాలు చేయలేదని వివరించారు. అయితే ప్రభుత్వ నివేదికలో కుటుంబీకులు ఆస్పత్రి పత్రాల్లో సంతకాలు చేశారని చెప్పారని, ఆ కుటుంబీకులు ఎవరో, బంధువులు ఎవరో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. జయను హతమార్చిన శశికళను కాపాడేందుకు ఆ పార్టీనేతలు ఎన్నిక రకాల ప్రయత్నాలు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని దీప హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ధర్మయుద్ధం నా కోసం కాదు.. పార్టీని కాపాడేందుకే : పన్నీర్ సెల్వం