Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారం నుంచి నో హెల్త్ బులెటిన్... తేడా రాస్తే అరెస్టు చేస్తున్న పోలీసులు... ఏంటి చెప్మా...?

అమ్మకేమైందో తెలియని సందిగ్దం. అమ్మ అంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె ఆరోగ్యంపై ఇంకా టెన్షన్ నడుస్తూనే ఉంది. గతవారంలో అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసినా వారం రోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు. ఐతే ఆమె గురించి ఎవరైనా ఏదయినా

వారం నుంచి నో హెల్త్ బులెటిన్... తేడా రాస్తే అరెస్టు చేస్తున్న పోలీసులు... ఏంటి చెప్మా...?
, సోమవారం, 17 అక్టోబరు 2016 (16:01 IST)
అమ్మకేమైందో తెలియని సందిగ్దం. అమ్మ అంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె ఆరోగ్యంపై ఇంకా టెన్షన్ నడుస్తూనే ఉంది. గతవారంలో అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసినా వారం రోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు. ఐతే ఆమె గురించి ఎవరైనా ఏదయినా తేడాగా రాస్తే మటుకు పోలీసులు వెతికి మరీ అరెస్టు చేస్తున్నారు. 
 
దీనితో ఆమె ఆరోగ్యంపై మీడియా ఫోకస్ పెట్టేందుకు కాస్త భయపడుతోంది. ఏం రాస్తే ఏం ఇబ్బందులు వస్తాయోనని ఏమీ రాయకుండా ఉంటున్నారు. ఇక సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ఎవరికి తోచినట్లు వారు రాస్తే వారిని కూడా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. అలా 50 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు కూడా.
 
కాగా సెప్టెంబరు 22న జయలలిత తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారంటూ అపోలో ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఆమె ఆరోగ్యంపైన రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆమె ఆరోగ్యంపైన వాకబు చేశారు. అమ్మకు ఎలాంటి చికిత్స చేస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఐతే అసలు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపైన ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లు ఇస్తుంటే తప్పుడు వార్తల ప్రచారానికి వీలు లేకుండా ఉంటుందని కొందరు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాతృత్వానికే మచ్చ తెచ్చింది.. కన్నబిడ్డను నేలకేసికొడుతున్నా.. సహజీవనం కోసం?