Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత 'అమ్మ ఉచితాల' ఖర్చు రూ.1.14 లక్షల కోట్లు.. ప్రతిపక్షాలు విలవిల

Advertiesment
Jayalalithaa's freebies
, ఆదివారం, 8 మే 2016 (09:27 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించిన మేనిఫెస్టో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జయ ప్రయోగించిన అమ్మ ఉచిత హామీలతో విపక్ష నేతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని జయలలిత మేనిఫెస్టోను తయారు చేశారు. 
 
ఈ దఫా ఎన్నికల్లో జయలలిత తిరిగి అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఉచిత హామీలను నెరవేర్చేందుకు ఆమె ఏకంగా 1.14 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌ కార్డుకు ఏటా దాదాపు రూ.11 వేల విలువ చేసే ఫలాలను ఐదేళ్లపాటు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం ఒక్కో పథకం అమలుకు ఖర్చు చేయాల్సిన వివరాలను పరిశీలిస్తే....
 
ఒకేసారి ఖర్చు చేయాల్సిన మొత్తం (రూ. కోట్లలో)
రైతు రుణ మాఫీ కోసం రూ.5,500
ఉచిత మొబైల్ ఫోన్ల కోసం  రూ.2,000
సెట్టాఫ్ బాక్సుల కోసం రూ.1,500
మహిళలకు మోపెడ్ రాయితీ రూ.45,000
మొత్తం రూ.54,000
 
ఒక్కో యేడాది ఖర్చు (రూ. కోట్లలో)
ఉచిత ఇంటర్నెట్ కోసం రూ.204
గిఫ్ట్ కూపన్ల కోసం రూ.1000
రోడ్‌సైడ్ క్యాంటీన్ల కోసం రూ.600
ఆవిన్ పాల ధర రాయితీ రూ.8858
ఉచిత విద్యుత్ కోసం రూ.1180
8 గ్రాముల బంగారు కోసం రూ.148
వీటన్నింటికి ఓ యేడాది అయ్యే ఖర్చు రూ.11990
ఐదేళ్ళకు అయ్యే మొత్తం ఖర్చు రూ.59950
అంటే ఐదేళ్ళలో మొత్తం ఉచిత హామీల అమలు కోసం ప్రభుత్వం రూ.1.14 లక్షల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు.. టీ ఎంసెట్‌కు సర్వం సిద్ధం