Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి... తమిళ ఓటర్లు సంప్రదాయాన్ని మార్చారు

Advertiesment
Jayalalithaa
, గురువారం, 19 మే 2016 (11:28 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా సర్వే నిర్వహించి వెల్లడించిన సర్వే ఫలితాలు లెక్క తప్పాయి. అలాగే, తమిళ ఓటర్లు తమ గత సంప్రదాయాన్ని మార్చేశారు. ఫలితంగా అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చరిత్రను తిరగరాసి.. సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
గురువారం వెల్లడవుతున్న ఫలితాల్లో అన్నాడీఎంకే స్పష్టమైన మెజార్టీని సాధించడం తథ్యమని తేలిపోయింది. దీంతో ముఖ్యమంత్రిగా జయలలిత వరుసగా రెండోసారి, మొత్తంగా ఆరోసారి సీఎంగా ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. 
 
వాస్తవానికి గత మూడు దశాబ్దాలుగా తమిళనాడులో అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సారి తమిళ ఓటర్లు ఈ సంప్రదాయాన్ని మార్చేశారు. అమ్మ వరుసగా రెండోసారి సీఎం పగ్గాలు అప్పగించనున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్ ప్రకారం తమిళనాడులో అన్నాడీఎంకే విజయం దాదాపు ఖాయమని తేలిపోయింది. 
 
మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే 133 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారంలోకి వస్తుందని భావించిన డీఎంకే 95 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 4 చోట్ల ముందజంలో ఉన్నారు. కాగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు.
 
డీఎంకే చీఫ్‌ ఎన్ని వాగ్ధానాలు చేసిన ప్రజలు నమ్మలేదు. మళ్లీ అమ్మ వైపే మొగ్గుచూపారు. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జయలలితకు లబ్ధిచేకూర్చాయి. ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా బరిలో దిగిన సినీ హీరో కెప్టెన్ విజయ్కాంత్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇతర పార్టీలతో కలసి కూటమిగా బరిలో దిగినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ కాంత్ చిత్తు చిత్తు... భూతద్దంలో వెతికినా కనిపించిన అడ్రెస్... మీడియాకు దొరకని కెప్టెన్