Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉడకబెట్టిన యాపిల్ పండ్లను ఆరగిస్తున్న జయలలిత... మెరుగు పడుతున్న ఆరోగ్యం

తీవ్ర అనారోగ్యం కారణంగా గత నెల 22వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోంది. వైద్యులు అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్న ఆమె... ఇపుడు ఆహారం త

Advertiesment
Jayalalithaa in hospital
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (08:27 IST)
తీవ్ర అనారోగ్యం కారణంగా గత నెల 22వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోంది. వైద్యులు అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్న ఆమె... ఇపుడు ఆహారం తీసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా మంచినీరు, ఉడకబెట్టిన యాపిల్‌ పండ్లను తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతం ఆమెకు అపోలో వైద్యులతో పాటు లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్‌ బీలే, ఎయిమ్స్‌ వైద్యులు, సింగపూర్‌కు చెందిన ఇద్దరు మహిళా ఫిజియోథెరపిస్టులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మెల్లగా కోలుకుంటున్నారు. అంతేగాక తనకు చికిత్స అందిస్తున్న వైద్యులందరికీ పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారని ఆస్పత్రివర్గాలు వివరించాయి. 
 
మరోవైపు.. జయ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హోసూరు తాలూకా బాగలూరులో వున్న మారియమ్మన ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. 5008 మంది మహిళలు పాలబిందెలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారిని ప్రార్థించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ 10 వేల కోట్ల నల్లధనం జగన్ మోహన్ రెడ్డివే అని నిరూపించండి... పెద్దిరెడ్డి సవాల్