Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గయ్యాళి అత్త సూర్యకాంతంలో తల్లిని చూసుకున్న జయమ్మ.. పులిహోర తింటూ ఎక్కిళ్లు వస్తే..?

అలనాటి తార.. గయ్యాళి అత్త పాత్రల్లో కనిపించిన సూర్యకాంతం.. స్వతహాగా ఆమె ఎంతో మంచిది. ప్రతిరోజూ తన ఇంటి నుంచి వంట చేసుకుని వచ్చి తోటి ఆర్టిస్టులతో పాటు లైట్ బాయ్‌లకు కూడా ఉంచేదట. జయలలితకు సూర్యకాంతం చే

Advertiesment
గయ్యాళి అత్త సూర్యకాంతంలో తల్లిని చూసుకున్న జయమ్మ.. పులిహోర తింటూ ఎక్కిళ్లు వస్తే..?
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (13:19 IST)
అలనాటి తార.. గయ్యాళి అత్త పాత్రల్లో కనిపించిన సూర్యకాంతం.. స్వతహాగా ఆమె ఎంతో మంచిది. ప్రతిరోజూ తన ఇంటి నుంచి వంట చేసుకుని వచ్చి తోటి ఆర్టిస్టులతో పాటు లైట్ బాయ్‌లకు కూడా ఉంచేదట. జయలలితకు సూర్యకాంతం చేసే పులిహోర అంటే చాలా ఇష్టమట. ఒకరోజు షూటింగ్‌ స్పాట్‌కు సూర్యకాంతం పులిహోర చేసి తీసుకువచ్చిందట. దాంతో ఉదయం షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి జయలలిత దృష్టంతా పులిహోర మీదే ఉందట. 
 
ఎప్పుడు బ్రేక్‌ ఇస్తారా.. ఎప్పుడు పులిహోర తిందామా అని ఆమె ఎదురుచూసేదట. బ్రేక రాగానే పరిగెత్తుకుంటూ.. వెళ్ళి పులిహోర తినడం ప్రారంభించేదట. అలా వేగంగా పులిహోర తీసుకోవడం ద్వారా అమ్మకు ఎక్కిళ్లు వచ్చాయట. పక్కనే ఉన్న సూర్యకాంతం గ్లాస్‌తో నీళ్లిచ్చి ప్రేమగా తట్టిందట. ఆ సమయంలో సూర్యకాంతంలో తన తల్లిని జయలలిత చూసుకుందట. ఇక, సూర్యకాంతం చనిపోయే సమయానికి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
 
ఆ సమయంలో తన పనులన్నింటినీ పక్కనబెట్టి సూర్యకాంతం భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సూర్యకాంతం చూపిన మాతృప్రేమను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మను ఆ స్థితిలో చూసి చలించిపోయిన రజనీకాంత్.. కంటతడి నెచ్చెలికి ఓదార్పు..