Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత మరణానికి తర్వాత చీకటి రాజకీయాలు జరిగాయా? అమ్మ సమాధికి బిచ్చగాడు..

దివంగత జయలలిత సమాధికి సందర్శకులు తాకిడి పెరిగిపోతోంది. తమిళులు అమ్మగా భావించే సెల్వి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనాలని భావించి నిరాశ చెందిన ఎంతో మంది ఆమె సమాధిని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించి, పుష్ప

జయలలిత మరణానికి తర్వాత చీకటి రాజకీయాలు జరిగాయా? అమ్మ సమాధికి బిచ్చగాడు..
, గురువారం, 8 డిశెంబరు 2016 (10:35 IST)
దివంగత జయలలిత సమాధికి సందర్శకులు తాకిడి పెరిగిపోతోంది. తమిళులు అమ్మగా భావించే సెల్వి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనాలని భావించి నిరాశ చెందిన ఎంతో మంది ఆమె సమాధిని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించి, పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పిస్తున్నారు.

ఇప్పటికే అనేక మంది ప్రముఖులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అమ్మ సమాధిని దర్శించుకున్నారు. తాజాగా 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు నాట అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూడా జయలలిత సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఉంచి ఆమెకు నివాళులర్పించారు.  
 
మరోవైపు.. దివంగత సీఎం జయలలిత మరణించిన వార్త బయటకు రాక ముందే చీకటి రాజకీయాలు జరిగినట్లు తెలుస్తోంది. అమ్మ మరణ వార్త ముందుగా తెలుసుకున్న శశికళ, తన పట్టు నిలుపుకోవడం కోసం మృతదేహం పక్కనుండగానే రాజకీయాలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మ మరణం తరువాత, మంత్రులు, ఎమ్మెల్యేలను అపోలోకు పిలిపించిన శశికళ, పన్నీర్ సెల్వం లేకుండానే వారితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.
 
ఆపై అర్ధరాత్రి 12 గంటలకు అన్నా డీఎంకే శాసనసభాపక్ష భేటీ, నేతగా పన్నీర్ ఎన్నిక, ఆగమేఘాల మీద 1.25 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం ఇత్యాది ఘటనలు జరిగిపోయాయి. ఇక జయ మృతదేహం అపోలో ఆసుపత్రిలో ఉండగానే చుట్టూ, శశికళ బంధువులు చేరిపోయారు. జయ రక్తసంబంధీకులెవరూ కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. వారు పాల్గొనలేదనడంకన్నా, ఆ అవకాశం వారికి శశికళ దక్కనీయలేదని వార్తలు వస్తున్నాయి.  
 
అంతకుముందు జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే, పార్టీని సొంతం చేసుకోవడానికి శశికళ పావులు కదిపారు. జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్‌, ఇతర బంధువర్గం అంతా ఒక్కసారిగా అపోలో ఆసుపత్రికి వచ్చి వాలింది. పన్నీర్ సెల్వంకు బదులు తనకు బాగా నమ్మకస్తుడైన మంత్రి పడపాటి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేసేందుకు శశికళ పావులు కదిపినట్టు తెలుస్తోంది. 
 
వాస్తవానికి జయలలిత ఐదో తేదీ సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకే చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు శశికళకు, పన్నీర్ సెల్వానికి స్పష్టం చేశారని సమాచారం. అప్పటి నుంచి రాజకీయం నడిచింది. జయలలిత మృతదేహం పోయెస్ గార్డెన్‌‌కు చేరుకునే సరికే శశికళ బంధువులు వచ్చిపడ్డారు. అక్కడి నుంచి రాజాజీ హాల్‌‌కు, మెరీనా బీచ్‌లో అంతిమ సంస్కారాలు ముగిసే వరకూ మరెవ్వరినీ ఆ స్థానాల్లోకి రానీయలేదు. జయలలిత కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి రానివ్వని శశికళ వ్యవహార శైలిని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి గర్భవతిని చేశాడు.. పెళ్లికి నిరాకరించడంతో బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన యువతి