బెంగుళూరులో జయలలిత 750 జతల చెప్పులు... 10 వేల చీరలకు పోలీసుల కాపలా!
ఇటీవల కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులే కాదు.. వేల కొలది చీరలు, వందల కొలది చెప్పులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జయలలితక
ఇటీవల కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులే కాదు.. వేల కొలది చీరలు, వందల కొలది చెప్పులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జయలలితకు చెందిన అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్న విషయంతెల్సిందే.
వీటిలో 750 జతల స్పిప్పర్లకు, 10,500 చీరెలు ఉన్నాయి. వీటికి నలుగురు పోలీసులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్రమాస్తుల కేసులో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ చీరల్లో చాలా వరకు సిల్క్ చీరెలు, బంగారం పూత పోసిన చీరెలున్నాయి. రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నట్లు చెబుతున్నారు. వాటిని తిరిగి ఇస్తారా, ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందా అనేది సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటుంది.
ఈ కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసు విచారణ పూర్తయి సుప్రీంకోర్టులో తీర్పు పెండింగులో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జయలలిత అక్రమాస్తుల కేసు కర్ణాటకకు బదిలీ అయింది. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను, వస్తువులను కర్ణాటకకు తరలించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు సిటీ సివిల్ కోర్టులోని మొదటి అంతస్తులో గల గదిలో భద్రపరిచారు.