Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత ఆరోగ్యంపై దాపరికం ఎందుకు? వీడియో రిలీజ్ చేసేస్తే పోలా.. కెప్టెన్ విజయ్ కాంత్

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై దాపరికం ఎందుకు? అపోలో ఆస్పత్రిలో చేరి 15 రోజులకుపైనే గడుస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఎందుకు స్పష్టమైన వివరాలను ప్రకటించట్లేదనే దానిపై ప్రస్తుతం సర్వత

Advertiesment
Jayalalithaa
, బుధవారం, 12 అక్టోబరు 2016 (17:27 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై దాపరికం ఎందుకు? అపోలో ఆస్పత్రిలో చేరి 15 రోజులకుపైనే గడుస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఎందుకు స్పష్టమైన వివరాలను ప్రకటించట్లేదనే దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. నేతలు పరామర్శించే సమయంలో కూడా మీడియాను ఎందుకు అనుమతించడం లేదు? రోజూ రొటీన్‌గా విడుదల చేస్తున్న హెల్త్‌బులిటెన్‌లు, ఆమెను అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్లు చెప్పడం, ఆమె క్షేమ సమాచారం అడిగిన ప్రతీసారి కోలుకుంటున్నారని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం అపోలో వైద్యులకు మామూలైపోయింది.

ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, కానీ ఆమె ఎలా ఉన్నారనేందుకు తగిన ఫోటోలు లేదా అమ్మనే మాట్లాడివ్వడం చేయట్లేదు. ఈ గందరగోళమే తమిళనాడు ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలవరపెడుతోంది. 
 
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత కరుణానిధి ఆమె ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు సంబంధించిన ఫోటోలను విడుదల చేయడమే ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఉత్తమ మార్గమని ఆయన సూచించారు. మరోవైపు నటుడు, డీఎండీకే అధినేత విజ‌య్ కాంత్ కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మ ఆరోగ్యంపై గల వదంతులకు చెక్ పెట్టాలంటే.. ఆమె వ్యక్తిగతంగా వీడియో ద్వారా ప్రజలకు తన ఆరోగ్య పరిస్థితిపై వివరించాలని.. తాను ఆరోగ్యంగానే ఉన్నాననే విషయాన్ని తెలియజేయాలని కెప్టెన్ డిమాండ్ చేస్తున్నారు.
 
ఇకపోతే.. చాలామంది సొంత పార్టీ కార్యకర్తలు కూడా అపోలో వైద్యులు ప్రకటిస్తున్న హెల్త్ బులిటెన్స్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్పష్టమైన సమాచారం వచ్చే వరకూ కదిలేని లేదని ఆసుపత్రి దగ్గర ఆమె అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. ఈ దాగుడుమూతల వ్యవహారానికి అపోలో వైద్యులు ఇంకెన్ని రోజులకు సాగదీస్తారోనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి షికార్లు చేస్తున్న వదంతులకు చెక్ పెట్టాలంటే.. అమ్మే స్వయంగా మాట్లాడాలని.. సదరు వీడియోను మీడియా విడుదల చేయాలని కెప్టెన్ డిమాండ్ చేస్తున్నారు. మరి జయమ్మ ఏం చేస్తారో వేచిచూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సార్క్ సదస్సుకు గండికొట్టిన మోడీ.. వాట్ ఎ షేమ్ అంటున్న నవాజ్ షరీఫ్.. చైనా, ఇరాన్‌లను?