ఆర్కే.నగర్ ఉప ఎన్నికల బరిలో జయలలిత మేనకోడలు.. శశికళకు షాక్
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఖాళీ ఏర్పడిన చెన్నై జిల్లాలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జయలలిత మేనకోడలు జయ దీపా ప్రకటించారు. ఆమె నిర్ణయ జయలలిత ప్రియ
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఖాళీ ఏర్పడిన చెన్నై జిల్లాలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జయలలిత మేనకోడలు జయ దీపా ప్రకటించారు. ఆమె నిర్ణయ జయలలిత ప్రియ నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఏమాత్రం మింగుడు పడని అంశంగా మారింది.
జయలలిత జీవించివున్నంత వరకు ఎక్కడా కనిపించని మేనకోడలు దీప.. జయ మరణం తర్వాత ఒక్కసారి తెరపైకి వచ్చారు. ఆ తర్వాత కార్యకర్తల ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆర్కే నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆమె ప్రటించారు. పైగా, ఈ స్థానం నుంచి శశికళ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని ఆ నియోజకవర్గ వాసులు ఇప్పటికే హెచ్చరికలు పంపారు.
ఈ నేపథ్యంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మేరకు తాను అదే నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దీపా తేల్చి చెప్పారు. జయలలిత వారుసురాలిగా తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని, అమ్మ మీద పేద ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కార్యకర్తలతో కలిసి పని చేస్తానని దీపా జయకుమార్ చెప్పారు.