Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలితకు సీరియస్.. అపోలో ముందు గుండెలు బాదుకుంటున్న కార్యకర్తలు..

తమిళనాడు సీఎం జయలలితకు గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావిస్తున్న నేపథ్యంలోనే ఆమెకు గుండెపోటు వచ్చిందనే వార్తతో రాష్ట్ర మొత్తం దిగ్

Advertiesment
Jayalalitha heart attack: Tamil Nadu CM Jayalalithaa suffers cardiac arrest
, సోమవారం, 5 డిశెంబరు 2016 (06:15 IST)
తమిళనాడు సీఎం జయలలితకు గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావిస్తున్న నేపథ్యంలోనే ఆమెకు గుండెపోటు వచ్చిందనే వార్తతో రాష్ట్ర మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 
 
74 రోజుల క్రితం (సెప్టెంబరు 22వ తేదీన) డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో జయ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. లండన వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు జీసీ గిలాని (పల్మనరీ మెడిసిన స్పెషలిస్ట్‌), అంజన ట్రికా (అనస్తీషియాలజిస్ట్‌), నితీష్‌ నాయక్‌ (కార్డియాలజిస్ట్‌) (మాజీ ప్రధాని మన్మోహనసింగ్‌ వ్యక్తిగత వైద్యుడు), సింగపూర్‌ ఫిజియోథెరపీ నిపుణులు ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్యం ఏమాత్రం కోలుకోలేదు. ప్రస్తుతం గుండెపోటు సైతం రావడంతో.. ఆమె సీరియస్‌గా ఉందని వైద్యులు ప్రకటించడంతో.. కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే పోలీసు భద్రతను పెంచి, ట్రాఫిక్‌ కట్టుదిట్టం చేశారు. 8.30 గంటల ప్రాంతంలో రాష్ట్రమంతా అన్ని పోలీసు స్టేషన్లకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంకా జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వచ్చిన వార్తలతో భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. రాత్రి సమయంలోను వేలాదిగా తరలివచ్చారు. మహిళా కార్యకర్తలు బోరున విలపిస్తూ గుండెల్ని బాదుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఆరోగ్యంపై కరుణానిధి ఆరా.. అమ్మ కోలుకోవాలని ట్వీట్.. స్టాలిన్ కూడా?