Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ ఆత్మ శశికళపై కోపంతో తిరుగుతుందట.. అందుకే రాష్ట్రానికి ఇన్ని కష్టాలా?

దివంగత సీఎం జయలలిత ఆత్మ శశికళ మీద కోపంగా తిరుగుతోందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అమ్మ పార్టీని కాపాడుకునేందుకు శశికళపై పోరుకు తమిళ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సన్నద్ధమయ్యారు.

Advertiesment
Jayalalitha
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (20:23 IST)
దివంగత సీఎం జయలలిత ఆత్మ శశికళ మీద కోపంగా తిరుగుతోందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అమ్మ పార్టీని కాపాడుకునేందుకు శశికళపై పోరుకు తమిళ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శశికళ మీద కోపంగా తిరుగుతోందని, అందుకే చిన్నమ్మకు అన్నీ ప్రతికూల వాతావరణాలే ఎదురౌతున్నాయని ఆ రాష్ట్ర ప్రజలు, అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
 
అమ్మ ఆత్మ శాంతించలేదని.. అందుకే పార్టీలో ఇలాంటి వాతావరణం ఏర్పడిందని ప్రజలు నమ్ముతున్నారు. తాను రాజకీయాల్లోకి రానని శశికళ స్వయంగా జయలలితకు అగ్రిమెంట్ రాసిచ్చారని, ఇప్పుడు అమ్మకు ఇచ్చిన మాట శశికళ తప్పుతున్నారని ఇటీవల పన్నీర్ సెల్వం ఆరోపించిన తరుణంలో.. చిన్నమ్మ మాట తప్పిందని.. అందుకే అమ్మ ఆత్మ శశికళపై గుర్రుగా ఉందని ఆమె బంధువులు కూడా అంటున్నారు. 
 
సరిగ్గా నెల క్రితం (జనవరి 10వ తేదీ) సోషల్ మీడియాలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తప్పుకోవాలని, ఆమె మీద జయలలిత ఆత్మ కోపంగా సంచరిస్తోందని ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. 
 
అమ్మ సమాధి వద్ద 40 నిమిషాల పాటు కూర్చుని ధ్యానం చేసుకున్న పన్నీర్ సెల్వం.. ఆపై మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ప్రజలకు సేవ చెయ్యడానికి నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని, అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని అమ్మ ఆత్మ తనకు చెప్పిందని, ఇప్పుడు కూడా తాను నోరు విప్పకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అమ్మ ఆత్మ గురించి సోషల్ మీడియాతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
శశికళ జయలలితకు పక్కనుండే ఎన్నో హింసలు పెట్టిందని.. పక్కా ప్లాన్ ప్రకారం అమ్మకు ద్రోహం చేసిందని ప్రజలు వాపోతున్నారు. అమ్మపై విషప్రయోగం, కిందికి తోసేశారని.. ఆపై ఆస్పత్రిలో అమ్మను చూపించకుండా చేశారని ప్రజలు శశికళపై కోపంతో ఉన్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉండగా ఒక్కరినీ చూడనివ్వకుండా శశికళ చేయడంపై అనుమానాలున్నాయని, అమ్మ మృతిపై విచారణ జరిపించాలని కూడా వారు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళను రెండు రోజుల్లో తరిమేస్తాం.. పార్టీ నుంచి బహిష్కరిస్తాం- పన్నీర్‌కే స్టాలిన్ సపోర్ట్