Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తేనే అరెస్టు చేస్తారా: అయితే ఏదో ఉన్నట్లే!

పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు స్పృహ కూడాలేదని, ఆమె చికిత్స పొందిన ప్రత్యేక గదివైపు ఏ ఒక్క డాక్టర్ని అనుమతించలేదని ఆరోపించిన డాక్టర్ రామసీతను అరెస్టు చేయడం ద్వారా తమిళనాడు పోలీసులు జయ మృతి

Advertiesment
జయ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తేనే అరెస్టు చేస్తారా: అయితే ఏదో ఉన్నట్లే!
హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (05:47 IST)
పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు స్పృహ కూడాలేదని, ఆమె చికిత్స పొందిన ప్రత్యేక గదివైపు ఏ ఒక్క డాక్టర్ని అనుమతించలేదని ఆరోపించిన డాక్టర్ రామసీతను అరెస్టు చేయడం ద్వారా తమిళనాడు పోలీసులు జయ మృతిపై మరికొన్ని అనుమానాలను రేకెత్తించారు. జయ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తేనే అరెస్టు చేస్తున్నారంటే అమ్మ మృతి వెనుక ఏదో రహస్యం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది మొత్తంమీద మరింత గందరగోళానికి, ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసేలా ఉంది.
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన మద్దతు ప్రకటించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక డాక్టర్‌గా జయలలిత మరణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. ఇంటి నుంచి అపొలో ఆస్పత్రికి వచ్చే సమయంలో జయలలితకు స్పృహ కూడా లేదని, ఆమె వెంట బంధువులు ఎవ్వరూ రాలేదని పేర్కొన్నారు. జయలలిత చికిత్స పొందిన ప్రత్యేక గది వైపు ఏ ఒక్క డాక్టర్నీ అనుమతించలేదని ఆరోపించారు. జయలలిత జయంతి సందర్భంగా శుక్రవారం మరోమారు ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. 
 
దీంతో సైబర్‌ క్రైం పోలీసులు ఆమెపై మూడు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. రామసీత అసలు డాక్టరే కాదని సైబర్‌ క్రైం వర్గాలు వాదిస్తుండడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోషి పేరిట పథకాలా అనడం కూడా స్టాలిన్ తప్పేనా? జయ బొమ్మ వివాదంపై మండిపడుతున్న ఏఐఏడిఎంకె