Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అట్టహాసంగా గాలి కుమార్తె పెళ్ళి.. పెళ్ళి చీర రూ.17కోట్లు.. ఆభరణాలకు రూ.90కోట్లు..

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులో అట్టహాసంగా జరుగనుంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బందులు తప్పని పరిస్థితుల్లో గాలి జనార్థనరెడ

Advertiesment
Janardhan Reddy's spending on daughter's wedding is as strategic as extravagant
, బుధవారం, 16 నవంబరు 2016 (09:40 IST)
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులో అట్టహాసంగా జరుగనుంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బందులు తప్పని పరిస్థితుల్లో గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లికి ఎలాంటి ఇక్కట్లు తలెత్తలేదు. వెడ్డింగ్ కార్డుతోనే అందరి దృష్టిని ఆకర్షించిన గాలి, తన కూతురి పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. 
 
సినిమా సెట్టింగ్స్‌తో పాటు తన కుమార్తె బ్రహ్మణికి ఆభరణాలు, చీరలు వంటివి పెళ్ళికోసం భారీ విలువతో కూడినవిగా గాలి కొనిపెట్టారు. గాలి జనార్థనరెడ్డి, శ్రీరాములు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కన్నడ చానల్‌లో ఈ పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి శుభలేఖతోనే అందరినీ అవాక్కయ్యేలా చేసిన గాలి జనార్థనరెడ్డి బ్రహ్మణి పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో ఆమె కట్టుకునే చీర దగ్గర్నుంచి పెట్టుకునే ఆభరణాల దాకా భారీగా ఖర్చు పెట్టారట. ఆమె కట్టుకునే చీర విలువ రూ.17కోట్లు. అలాగే ఆభరణాలు రూ.90కోట్ల రూపాయలు వెచ్చించారట.
 
ఇదిలా ఉంటే.. అయితే కోట్ల కొద్దీ సొమ్మును గాలి తన కుమార్తె వివాహంలో మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. కనీసం వంద కోట్లకు పైగా డబ్బు ఖర్చు పెట్టి ఆర్భాటంగా ఈ పెళ్లిని జరిపించనున్నారనే సమాచారం అందడంతో ఐటీ శాఖ నిఘా పెట్టేందుకు సన్నద్ధమైంది. 
 
ఇప్పటికే అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి అరెస్టు, బెయిలుపై విడుదల అయ్యాడు. 2007-2011 సంవత్సరాల మధ్య కాలంలో గాలి 1200 కోట్ల వరకు అక్రమంగా సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ఆయన ప్రత్యర్థి తపల్ గణేష్ ఆయన వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడట.
 
కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ కుమార్.. ఈ పెళ్ళికి తాను హాజరు కావడం లేదని ప్రకటించారు. ఇంత ఖర్చుతో..ఇంత ఆర్భాటంగా ఈ వెడ్డింగ్ చేయాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అటు బెంగుళూరు ప్యాలస్ గ్రౌండ్‌ను ఓ కోటలా మార్చేశారు. మీడియా ప్రతినిధులు రాకుండా బౌన్సర్లను నియమిస్తున్నారు. విజయనగర రాజుల కోట మాదిరి ఈ గ్రౌండ్‌ను అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. 
 
బాలీవుడ్, టాలీవుడ్ సినీ దిగ్గజాల్లో ఇప్పటికే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ పెళ్ళిపై ఐటీ కన్ను పెట్టినా పర్లేదని, పెళ్ళి అయ్యాక ప్రతి పైసాకు లెక్క చూపిస్తానని.. అలాగే ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా చెప్తానని గాలి ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.6 వేల కోట్లు కాదు కదా.. 6 పైసలు కూడా ఇవ్వలేదు : సూరత్ వజ్రాల వ్యాపారి