Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల్లికట్టు పోరాటానికి మద్దతు.. రూ.కోటి ఇస్తానన్న రాఘవ లారెన్స్

తమిళనాడు రాష్ట్రం అట్టుడుకి పోతోంది. తమ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్న

Advertiesment
Jallikattu protests
, గురువారం, 19 జనవరి 2017 (07:02 IST)
తమిళనాడు రాష్ట్రం అట్టుడుకి పోతోంది. తమ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. వీరికి అనేక సంస్థలతో పాటు సినీ నటీనటులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో... జల్లికట్టు కోసం పోరాడుతున్న విద్యార్థులకు దర్శకుడు రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. స్థానిక మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు. అంతేకాదు, ఈ పోరాటంలో పాల్గొనే వారి ఆకలి దప్పుల కోసం కోటి రూపాయలు ఖర్చయినా తాను భరిస్తానని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'జల్లికట్టు కోసం తమిళులందరూ ఒక్కటయ్యారు. ఇదే మనకి సగం విజయం. నటీనటులందరూ జల్లికట్టుకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయం. నిన్న (మంగళవారం) నాకు ఒక సందేశం వచ్చింది. పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, మంచినీళ్లు లభించడం లేదని. వరదలు వచ్చినప్పుడు సాయం చేశాం. ఈ పోరాటానికీ చేస్తాం. కోటి రూపాయలు ఖర్చయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
 
అంతేకాకుండా, జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దం పట్టే క్రీడ. దానిని జరుపుకోకుండా అడ్డుపడే విదేశీ శక్తులను అడ్డుకోవాలి. జల్లికట్టు నిర్వాహకుల నుంచి విద్యార్థులు, సినీ కళాకారుల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది న్యాయమైనది. రాష్ట్ర ప్రభుత్వం జల్లికట్టుని జరపాలనే తీర్మానాలు చేసింది. అయినప్పటికీ కేంద్రం ఇంకా పూర్తిగా దృష్టి సారించాలి. విద్యార్థుల పోరాటాన్ని చూసి కేంద్రం దిగొస్తే మంచిది' అని లారెన్స్ ఆవేశంగా మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌ ఇదే... ధర ఎంతో తెలుసా?