Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల్లికట్టు పోరాటంలో ఉద్రిక్తత.. మెరీనా బీచ్‌లో దూకుతామని యువత బెదిరింపులు

జల్లికట్టు పోరాటం అదుపుతప్పింది. గత వారంరోజులుగా ఆందోళన చేస్తున్న యువత, విద్యార్థులు, నగర వాసులు సోమవారం బెదిరింపులకు దిగారు. జల్లికట్టు క్రీడా పోటీలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతూ వారు మొండిపట్

Advertiesment
Jallikattu ordinance
, సోమవారం, 23 జనవరి 2017 (08:31 IST)
జల్లికట్టు పోరాటం అదుపుతప్పింది. గత వారంరోజులుగా ఆందోళన చేస్తున్న యువత, విద్యార్థులు, నగర వాసులు సోమవారం బెదిరింపులకు దిగారు. జల్లికట్టు క్రీడా పోటీలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతూ వారు మొండిపట్టుపట్టిన విషయం తెల్సిందే. అంతేనా.. మెరీనా బీచ్ నుంచి తమను వెళ్ళగొట్టాలని చూస్తే సముద్రంలో దూకుతామని బెదిరింపులకు దిగారు. దీంతో మెరీనా తీరం ఉద్రిక్తంగా మారింది. 
 
నిజానికి జల్లికట్టు క్రీడా పోటీల కోసం తమిళనాడు ప్రభుత్వం అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అయినప్పటికీ.. విద్యార్థులు శాంతించలేదు. సమస్యకు పరిష్కారం తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పూర్తి స్థాయిలో నిషేధం ఎత్తివేసే దాకా తమ పోరాటం ఆగదని తమిళులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 
 
మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఖాళీ చేయించాలని చూస్తే, సముద్రం దూకుతామని విద్యార్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు.
 
శాంతిభద్రతలకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం తలమునకలైంది. ఇదిలావుంటే, తమిళులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయసినీ వర్గాలు పూర్థి స్థాయిలో మద్దతు ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు బాబయ్యా: ఓటర్లను వేడుకుంటున్న బీజేపీ అభ్యర్థులు