Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్డినెన్స్ తీసుకువస్తా.. జల్లికట్టు పోటీలు నిర్వహిస్తాం : సీఎం పన్నీర్ సెల్వం

మితభాషి అయిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆగ్రహం వచ్చింది. జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్

ఆర్డినెన్స్ తీసుకువస్తా.. జల్లికట్టు పోటీలు నిర్వహిస్తాం : సీఎం పన్నీర్ సెల్వం
, శుక్రవారం, 20 జనవరి 2017 (12:41 IST)
మితభాషి అయిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆగ్రహం వచ్చింది. జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆయన కేంద్రం వైఖరిని ఖండిస్తూ తన మనస్సులోని మాటను బహిర్గతం చేశారు. 
 
జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ ఆర్డినెన్స్‌ను శుక్రవారం కేంద్రానికి పంపామని ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి అనుమతి లభిస్తుందన్నారు. జల్లికట్టుపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని చెప్పిన సీఎం రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అవుతుందని, ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యమాన్ని విరమించాలని తమిళ ప్రజలను కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
 
మరోవైపు.. జల్లికట్టు నిషేధంపై సుప్రీంకోర్టు వెల్లడించాల్సిన తీర్పు వారం రోజులు వాయిదా పడింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పును వాయిదా వేసింది. 
 
ఇదిలా ఉంటే తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్ధతు అనూహ్యంగా పెరుగుతోంది. దాదాపు లక్ష మంది మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ప్రధానితో గురువారం భేటీ అయిన తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఆర్డినెన్స్‌ ముసాయిదా హోంశాఖకు వెళ్లిందని పన్నీర్‌ సెల్వం వెల్లడించారు. వీలైనంత త్వరగా ఆర్డినెన్స్‌ వస్తుందని భావిస్తున్నామని సెల్వం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముఖ్యమంత్రిని పగబట్టిన కాకి.. ఇపుడు ఏం చేసిందో తెలుసా?