Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్ళీ జల్లికట్టు ప్రారంభం, రక్తం కారుతున్నా..దెబ్బలు తగులుతున్నా..ఎందుకు..?

Advertiesment
మళ్ళీ జల్లికట్టు ప్రారంభం, రక్తం కారుతున్నా..దెబ్బలు తగులుతున్నా..ఎందుకు..?
, మంగళవారం, 4 జనవరి 2022 (23:31 IST)
పండగంటే పండగ. అందులోనూ సంక్రాంతి పండుగ అంటే ఆ మజానే వేరు. కొత్త బట్టలు, పిండివంటలు, గొబ్బెమ్మలు... ఇవన్నీ మూమూలే. అంతటితో ఆగితే సరదా ఏముంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో పందెం కోళ్లకు రంగంలోకి దించుతారు. మరి కొన్ని ప్రాంతాల్ల కోడెద్దులతో కయ్యానికి కాలు దువ్వుతారు. 

 
మరో ప్రాంతంలో వేగంగా వేళ్లే ఆవులను, ఎద్దులను అడ్డుపడి అదుపు చేస్తారు. అలా చేసిన వారే ఆ ఊరికి మొనగాని అర్ధం. అలాగని ఇదేదో పోటీలాగా నిర్వహిస్తే పర్వాలేదు. ఊరు ఊరంతా ఇందులో పాల్గొంటారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ ఆ ఆట లేనిది వారు జరుపుకునే పండగకు నిండుదనం రాదంటారు. అలాంటి సాంప్రదాయానికి చిత్తూరు జిల్లా రంగంపేట మరోసారి వేదిక కాబోతుంది. 

 
పండగంటే గంగిరెద్దులే చాలా మందికి గుర్తుకు వస్తాయి. కానీ కయ్యానికి కాలుదువ్వే ఎద్దులనే ఇక్కడివారు ఎక్కువగా ఇష్టపడతారు. వాటితో సై అంటే సై అంటారు. ఒకటికాదు రెండు కాదు వందల సంఖ్యలో ఆవులను ,లేగదూడలను ,ఎద్దులను సందులోకి వదుతారు. అదేదో సినిమాల్లో సీమ సందుల్లోకిరారా చూసుకుందాం  అంటారుగా .. అచ్చం అలాగే సందుల్లోకి వీటిని వదిలి వేగంగా పరెత్తే సమయంలో నిలువరించడానికి ప్రయత్నిస్తారు. 

 
ఒక రకంగా ప్రాణాలతో చెలగాటమే అయినా అదే వారికి ఎక్కువ మజా నిస్తుంది. వారి పండగకు ప్రత్యేకను చేకూర్చుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఆచారాన్ని ప్రతి సంక్రాంతికి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టు లు కూడా మందలించినప్పటికీ ,దానికి దూరంగా జరగడానికి వారికి మనసొప్పడం లేదు. పెద్దల వారసత్వం పోతుందనో, లేక జల్లీ కట్టులో వాళ్ల ఊరికి ఉండే ప్రత్యేక పోతుందో కానీ ,మొత్తానికి సంక్రాంతి పండగ అంటే జట్టు హాట్ టాపిక్. 

 
కోనసీమ జిల్లాలోల్లో కోడి పందేలు ఎలా హాట్ టాపికో.. ఇక్కడ జల్లీ కట్టు అలా అనమాట. మళ్లీ సంక్రాంతి రానే వచ్చింది. ఎద్దులను సిద్దం చేస్తున్నారు. వాటి కొమ్ములకు పదును పెడుతున్నారు. అందంగా అలంకరిస్తున్నారు. అలా పదునుగా ఉండే కొమ్ములకు ఒక పలకను కట్టి వాటిని మందలో పరెగెత్తిస్తారు. అలా పరిగెత్తే టైంలో వాటిని నిలువరించి ఆ కొమ్ములకు ఉండే పలకను తీసుకోవాలి. అది మొత్తానికి పందెంలో రూపంలో చెప్పాలంటే జల్లీ కట్టు కథ. 

 
జల్లికట్టు గ్రామస్తులకు ఉత్సాహం తెప్పించినా జంతుప్రేమికులకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నోరులేని జీవాలను జనం మధ్యలోకి వదిలి పట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జంతు ప్రేమికులు. జల్లికట్లుపై నిషేధం పెట్టినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. 

 
ఇప్పటికే జల్లికట్లును నిషేధించినా గ్రామాల్లో మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. గాయాలపాలైనా, ప్రాణాలు పోయినా సరే లెక్కచెయ్యకుండా జల్లికట్టులో పాల్గొంటున్నారు. పశువులను తరమడం, వాటి నెత్తిపై కట్టిన బహుమతులను పొందడం ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో చిత్తూరుజిల్లా రంగంపేటలో ఈ జల్లికట్టు జరుగనుంది. అంతే కాదు ఇప్పటికే శానంబట్ల గ్రామంలో జల్లికట్టు  జరిగి ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయినా సరే గ్రామస్తులు వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా జల్లికట్టును ఆడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో తెలంగాణాలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు