Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్టు ఆంక్షలు బేఖాతర్... అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు.. ఖాకీల లాఠీచార్జ్

తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాజ్ఞలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఈ పోటీలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యధేచ్చగా నిర్వహిం

కోర్టు ఆంక్షలు బేఖాతర్... అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు.. ఖాకీల లాఠీచార్జ్
, సోమవారం, 16 జనవరి 2017 (13:43 IST)
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాజ్ఞలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఈ పోటీలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యధేచ్చగా నిర్వహించారు. మరికొన్నిచోట్ల జల్లికట్టు నిర్వాహకులు నిరసనలతో అట్టుడుకిపోయింది. 
 
ఇదిలావుండగా, జల్లికట్టు పోటీలకు పెట్టిందిపేరైనా అలంగానల్లూరులో యధేచ్చగా జల్లికట్టు పోటీలు నిర్వహించారు. అందంగా ఆలంకరించిన ఎద్దులను వీధుల్లోకి వదిలారు. ఆ తర్వాత వందలాదిమంది యువకులు వాటి వెంట పరుగుడెతూ.. ఎద్దులను పరుగు పెట్టించారు. తద్వారా కోర్టు ఆంక్షలను పట్టించుకోకుండా జల్లికట్టు నిర్వహించామని నిరూపించారు. 
 
అయితే, పోలీసులు వెంటపడి వీరిని కొట్టేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. జల్లికట్టును నిర్వహించిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ‌చార్జ్ చేశారు. ఎద్దులను లాక్కుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలోపే ప్రజలు చేయాలనుకున్నది చేసేశారు. అలంగానల్లూరులో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
 
సోమవారం ఉదయమే ఎద్దులను ఆలంకరించి, స్థానిక కాళీయమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. పోలీసులు దానికి అభ్యంతరం చెప్పలేకపోయారు. అదే జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా మలచుకున్న స్థానికులు ఈ పోటీలను యధేచ్చగా నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా చీఫ్ జగన్‌కు టీడీపీ యువ నేత సంక్రాంతి కానుక.. ఏంటది?