Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనీ... స్నేహితులతో రేప్ చేయించాడు.. ఎక్కడ?

తాను ప్రేమించి.. శారీరంగా వాడుకున్న యువతిని ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కోపంతో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడో ప్రియుడు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగింది. ఈ వివరాలను ప

పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనీ... స్నేహితులతో రేప్ చేయించాడు.. ఎక్కడ?
, మంగళవారం, 25 జులై 2017 (14:40 IST)
తాను ప్రేమించి.. శారీరంగా వాడుకున్న యువతిని ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కోపంతో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడో ప్రియుడు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
జలంధర్ నగరానికి చెందిన 19 ఏళ్ల హర్‌ప్రీత్‌సింగ్ అనే యవకుడు అదేప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని మాయమాటలు చెప్పి అమ్మాయిని మార్కెట్ వద్దకు హర్‌ప్రీత్ రప్పించాడు. ఆతర్వాత తన స్నేహితులైన బిందు, రవి అనే ఇద్దరితో కలిసి అమ్మాయిని నగర శివార్లలోని ఓ పొలానికి తీసుకువెళ్లాడు. 
 
అక్కడి గదిలో స్నేహితులతో కలిసి ప్రియురాలిపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఓ పాడుపడిన భవనం వద్దకు తీసుకువెళ్లి మరోసారి ముగ్గురూ అత్యాచారం చేశారు. ఆ కామాంధుల బారినుంచి బయటపడిన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధిత యువతికి వైద్యపరీక్షలు చేయించగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తేలింది. 
 
దీనిపై ఐపీసీ సెక్షన్ 376, 120బి, 417ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన హర్‌ప్రీత్‌సింగ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులైన రవి, బిందుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డకు కన్యత్వ పరీక్షలు చేయించి... విటులకు అమ్మేసిన తల్లి