Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరులో ఐటీ సోదాల కలకలం.. 120కి పైగా కార్లు సీజ్‌!

బెంగుళూరులో ఐటీ సోదాల కలకలం.. 120కి పైగా కార్లు సీజ్‌!
, గురువారం, 7 అక్టోబరు 2021 (13:22 IST)
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారులు గురువారం విస్తృత సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు వ్యాపారవేత్తలు, గుత్తేదారులు, ఛార్డెట్‌ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరుపుతున్నారు. 
 
గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్‌ చేసినట్లు సమాచారం. 
 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్‌ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉమేశ్‌ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయి చేరుకోనుంది.. ప్రధాని మోదీ