Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటీ దాడి.. పన్నీర్‌కు తెలిసే జరుగుతోందా? మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్?

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు తర్వాత అన్నాడీఎంకే పార్టీలో సమర్థవంతమైన నేత లేకపోవడంతో ఆ పార్టీని రిమోట్ కంట్రోల్ ద్వారా తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంద

Advertiesment
IT dept raids residence of Tamil Nadu chief secy Rammohan Rao in Chennai
, బుధవారం, 21 డిశెంబరు 2016 (13:26 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు తర్వాత అన్నాడీఎంకే పార్టీలో సమర్థవంతమైన నేత లేకపోవడంతో ఆ పార్టీని రిమోట్ కంట్రోల్ ద్వారా తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం అన్నాడీఎంకే నేతల ఇళ్లపై జరిగే ఐటీ దాడులేనని తెలుస్తోంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, నెచ్చెలి శశికళతో పాటు అన్నాడీఎంకే మంత్రులకు అత్యంత సన్నిహితుడైన రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి తర్వాత పన్నీర్ సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళకు వంత పాడారు. తాజాగా ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఇంటి మీద ఐటీ దాడులు జరిగే ముందు కచ్చితంగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు తెలిసి ఉంటుందని చర్చ సాగుతోంది.

పన్నీర్ సెల్వంకు తెలిసే ఐటీ దాడులు జరిగాయా ? తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ను ఐటీ అధికారులు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ? అనే విషయం అంతుపట్టడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.
 
ఇందుకు కారణం లేకపోలేదు. అన్నాడీఎంకే పార్టీలో సమర్థవంతమైన నేత లేకపోవడంతో తమిళ రాష్ట్రంలో బీజేపీ నాటుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే నేతల్లో గుబులు మొదలుపెట్టేందుకు ఐటీ దాడులను అస్త్రంగా మార్చుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత లాంటి నేత తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తమిళనాట బ్రహ్మరథం పట్టే ప్రాంతీయ పార్టీల హవాకు చెక్ పెట్టాలని ఢిల్లీలోకి కేంద్రం భావిస్తోంది.

ఈ క్రమంలో అన్నాడీఎంకే నేతల ఇంటిపై ఐటీ దాడులకు మోడీ సర్కారు పురిగొల్పుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని.. తమిళనాట బీజేపీ పాదా వేయాలనుకుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విధానానికి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకుంటాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏటీఎంల్లో ఎంతైనా తీసుకోవచ్చు.. డిసెంబర్ 30తో సీన్ మారనుందా? బ్లాక్ మనీ పార్టీలకు చెక్?