Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి భారత్ చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సై అంటోంది. చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేస్తోంది.

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?
, ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (16:28 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి భారత్ చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సై అంటోంది. చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేస్తోంది. 
 
తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ల్యాండింగ్ సిమ్యులేషన్‌కు ఇస్రో సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 70-80 మీటర్ల ఎత్తు నుంచి చంద్రుని వాతావరణానికి అనుగుణంగా ల్యాండింగ్ ప్రక్రియపై ప్రయోగాలు చేస్తోంది. 
 
ఇందుకోసం చంద్రుడి దక్షిణ ధ్రువంలో రెండు ప్రదేశాలను గుర్తించామని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. చంద్రయాన్-2 హార్డ్ వేర్ సిద్ధమవుతోందని, 2018 ప్రథమార్థం లేదంటే ద్వితీయార్థంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలున్నట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా