Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లకుబేరులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు.. రూ.కోట్లు వైట్‌మనీగా మార్చేశారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయానికి బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది ఆదిలోనే తూట్లు పొడుస్తున్నారు. నల్లకుబేరులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చేశారు. దీంతో నల్లధనం నిర్మూలనకు ప్ర

నల్లకుబేరులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు.. రూ.కోట్లు వైట్‌మనీగా మార్చేశారు
, మంగళవారం, 29 నవంబరు 2016 (14:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయానికి బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది ఆదిలోనే తూట్లు పొడుస్తున్నారు. నల్లకుబేరులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చేశారు. దీంతో నల్లధనం నిర్మూలనకు ప్రధాని మోడీ చేపట్టిన చర్యలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురైనట్టుగా భావించవచ్చు. 
 
దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ పరిధిలోని ఓ బ్యాంకులో రద్దైన కరెన్సీని మూడు అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో డిపాజిట్ చేసిన ఉదంతాన్ని ఆదాయ పన్ను శాఖ బయటపెట్టింది. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ ఒక్క బ్యాంకులోనే మూడు అకౌంట్ల పేరుతో డిపాజిట్ అవ్వడంతో ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. 
 
నవంబర్ 11 నుంచి 22 వరకూ ఈ బ్రాంచ్‌లో కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్ల నుంచి ఈ డబ్బంతా డిపాజిట్ కావడం గమనార్హం. మూడు అకౌంట్ల నుంచి కోట్లకు కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డబ్బులో చాలావరకూ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులదే అయ్యిండొచ్చని ఐటీ అధికారులు భావిస్తున్నారు. 
 
ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని బ్యాంకు మేనేజర్‌ను, సదరు సిబ్బందిని ఐటీ శాఖ ప్రశ్నిస్తోంది. ఢిల్లీలోని ఈ ఒక్క బ్యాంకులోనే కాదు చాలా బ్యాంకుల్లో అధికారులు నల్ల దొంగలతో కుమ్మక్కయ్యారనే అనుమానం వ్యక్తమవుతోంది. దేశ రాజధానిని నల్ల డబ్బు మార్చుకునేందుకు కేంద్రంగా మార్చుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బ్యాంకు అధికారులే ఇలా మోసాలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితేంటని జనం మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రచందనం వేటగాళ్ల ఆస్తులపై వేట..... కూపీ లాగుతున్న ఏపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్