Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 జూన్, ప్రపంచం ఇటే చూస్తోంది...

యావత్ ప్రపంచం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటుంది. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలి

Advertiesment
yoga day importance
, సోమవారం, 20 జూన్ 2016 (22:45 IST)
యావత్ ప్రపంచం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటుంది. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో పురుడుపోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది.
 
భారతీయ సనాతన యోగ శాస్త్రానికి ఉన్న విలువను, దాని ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయ సమాజం అధికారంగా గుర్తెరిగిన సంవత్సరంగా 2014 సంవత్సరం నిల్చిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబరు 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతిపాదన చేశారు. యోగా ప్రాధాన్యతను గూర్చి మోదీ వివరిస్తుంటే సభ్యులంతా శ్రద్ధగా విన్నారు. యోగా ఒక్క భారతదేశానికే పరిమితం కాదని, ఈ భూమ్మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమేనని మోదీ తనదైన పంథాలో విడమర్చి వివరించారు. 
 
ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐరాస వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 11న మోదీ ప్రతిపాదనను ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 193 సభ్య దేశాలకు 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. దీంతో జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 
 
2015 జూన్ 21న ఢిల్లీ రాజ్‌పథ్‌లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అదేరోజు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం మరో విశేషం. ఒకే వేదికపై 35,985 మంది యోగా చేసిన మెగా ఈవెంట్‌తో పాటు, 84 దేశాల పౌరులు పాల్గొన్న ఏకైక యోగా క్రమక్రమంగా జంట రికార్డులు నమోదయ్యాయి. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ధీటుగా రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి యావత్ భారతదేశం సమాయత్తమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది మేమే.. ఆల్‌ఖైదా పేరుతో లేఖ