Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేటింగ్‌.. డేటింగ్... డేటింగ్... ఆన్‌లైన్‌ డేటింగ్ వలలో భారత యువత

డేటింగ్.. డేటింగ్... ఆన్‌లైన్ డేటింగ్.. ఇది యువత జపిస్తున్న మంత్రపఠనం. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పోర్న్ సైట్లను వీక్షించే యువతతో పాటు.. ఆన్‌లైన్ డేటింగ్ చేసుకునే యువత నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా దే

Advertiesment
Indian youth
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:31 IST)
డేటింగ్.. డేటింగ్... ఆన్‌లైన్ డేటింగ్.. ఇది యువత జపిస్తున్న మంత్రపఠనం. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పోర్న్ సైట్లను వీక్షించే యువతతో పాటు.. ఆన్‌లైన్ డేటింగ్ చేసుకునే యువత నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా దేశంలోని యువతలో 38 శాతం మంది ఆన్‌లైన్ డేటింగ్‌లో మునిగితేలుతున్నట్టు సర్వే ఫలితాల్లో తేటతెల్లమవుతోంది. 
 
అయితే, ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్న వారిలో 50 శాతానికి పైగా ఆన్‌లైన్‌ డేటర్లు ఈ ప్రమాదంలో ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు.. ప్రతి ఐదుగురులో ముగ్గురు ఈ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లు, యాప్స్‌ వినియోగిం చడం వల్ల పెద్ద ప్రమాదమే ఎదుర్కొంటున్నారని చెబుతోంది. ప్రస్తుతం 8 శాతం మంది అమ్మాయిలు.. 13 శాతం మంది అబ్బాయిలు రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ను తమ మొబైల్‌ డివైజెస్‌లో వినియోగించుకుంటున్నట్టు తేలింది. 
 
ఫలితంగా ఇది అతిపెద్ద వ్యాపారంగా మారుతున్న ఈ డేటింగ్‌, సైబర్‌ క్రిమినల్స్‌కు బంగారు బాతుల్లామారుతున్నాయని కూడా చెబుతున్నారు. 16 సంవత్సరాల వయసు పైబడిన యువతీయువకులపై నార్టన్‌ సంస్థ చేసిన మొబైల్‌ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలెన్నో వెల్లడించింది. వీటిని పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌ డేటింగ్‌ సేవలను వినియోగించుకుంటున్న 64 శాతం మంది మహిళలు, 57 శాతం మంది పురుషులు తాము సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొంటున్నామంటున్నారు కానీ తమ వ్యసనం మాత్రం ఆపుకోలేక పోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీనేజ్ కుమార్తెపై అత్యాచారం.. కిరాతక తండ్రికి 1503 యేళ్ల జైలుశిక్ష... అమెరికా కోర్టు తీర్పు