Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలు ప్రయాణికులకు శుభవార్త - 25 శాతం చార్జీల తగ్గింపు

vande bharat
, ఆదివారం, 9 జులై 2023 (13:56 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందే భారత్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్తర్వురు జారీచేసింది. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, విస్టోడామ్, అనుభూతి కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చార్జీలను తగ్గించనుంది. అయితే, ఈ చార్జీల తగ్గింపు రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. 
 
సెలవులు, పండుగ సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈపథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంనేందుకు వీలుగా ఏసీ కోచ్‌లలో ప్రయాణాలపై రాయితీ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తగ్గించిన యితీ తక్షణమే అమల్లోకి వస్తుందని, అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి మాత్రం చార్జీలు వాపస్ ఉండదని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను హతమార్చి.. సన్యాసిగా మారిన భర్త.. పట్టించిన ఫోన్‌ పే ట్రాన్సాక్షన్