ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే భారతీయుడు గత వారం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అక్రమంగా సరిహద్దు దాటినందుకు అరెస్టయ్యాడు. అతడు లాహోర్ నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండి బహౌద్దీన్ జిల్లాలోకి ప్రవేశించి, తన ఫేస్‌బుక్ స్నేహితురాలు సనా రాణిని కలుసుకుని వివాహం చేసుకున్నాడు.
ప్రేమ కోసం పాకిస్థాన్ సరిహద్దు దాటాడు. వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్ ద్వారా రెండున్నరేళ్లుగా పరిచయం ఉన్న రాణిని పెళ్లి చేసుకునేందుకు సరిహద్దు దాటినట్లు బాదల్ బాబు విచారణలో అంగీకరించాడు. అతని అరెస్టు తరువాత, అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి 21 సంవత్సరాల వయస్సు గల రాణిని పిలిచారు.
అయితే తనకు బాదల్‌ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రాణి పోలీసులకు సమాచారం అందించింది. "మేము గత రెండున్నరేళ్లుగా ఫేస్‌బుక్‌లో స్నేహితులం, కానీ నేను అతనిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు" అని పంజాబ్ పోలీసు అధికారి నసీర్ షా తెలిపారు.
బాదల్‌తో ఆమెకు ఉన్న సంబంధాలపై రాణి కుటుంబం, గూఢచార సంస్థలను కూడా ప్రశ్నిస్తున్నట్లు షా తెలిపారు. అరెస్టుకు ముందు బాదల్ రాణిని నిజంగా కలిశాడా లేదా అనేది తాను ధృవీకరించలేనని షా పేర్కొనడంతో ఘటన మరింత మలుపు తిరిగింది. కుటుంబ ఒత్తిడి కారణంగా రాణి బాదల్‌ను వివాహం చేసుకోవడానికి నిరాకరించి ఉండవచ్చని తెలుస్తోంది.
పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి సరైన చట్టపరమైన పత్రాలు లేని బాదల్ బాబుపై పాకిస్తాన్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 13, 14 కింద అభియోగాలు మోపారు. స్థానిక కోర్టు అతన్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.