నోట్ల రద్దు... ఇది కొత్త కాదు... 1946, 1978లోనే... రూ. 5000, రూ. 10,000 నోట్లను కూడా....
న్యూఢిల్లీ: భారత దేశంలో ఇలా పెద్ద నోట్లు రద్దు చేయడం కొత్తేమీ కాదు. 1946లో పెద్ద నోట్లను రద్దు చేశారు. తిరిగి 1978లో అదే పని చేసింది భారత ప్రభుత్వం. రిజర్వు బ్యాంకు 1938లో, 1954లో అతి పెద్దదయిన 10 వేల రూపాయల నోటు ముద్రించింది. కానీ, వాటిన
న్యూఢిల్లీ : భారత దేశంలో ఇలా పెద్ద నోట్లు రద్దు చేయడం కొత్తేమీ కాదు. 1946లో పెద్ద నోట్లను రద్దు చేశారు. తిరిగి 1978లో అదే పని చేసింది భారత ప్రభుత్వం. రిజర్వు బ్యాంకు 1938లో, 1954లో అతి పెద్దదయిన 10 వేల రూపాయల నోటు ముద్రించింది. కానీ, వాటిని 1946 జనవరిలో తిరిగి 1978లో రద్దు చేశారు. 1954లో వెయ్యి, 5 వేలు, పది వేల నోటును ప్రవేశపెట్టారు. కానీ ఆర్ధిక మాంద్యం పెరిగిపోతోందని 1978 జనవరిలో వాటిని రద్దు చేశారు.
ఇపుడు రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటు నవంబరు 2000లో ముద్రించారు. అలాగే ఇపుడు రద్దయిన 500 నోటు 1987 అక్టోబరులో చెలామణిలోకి వచ్చింది. ఇక ఇపుడు కొత్తగా వచ్చిన 2 వేల రూపాయల నోటు మాత్రం ముద్రించడం ఇదే తొలిసారి. గతంలోని నోట్లు అశోక స్థూపంతో వస్తే, ఇప్పటి నోట్లు టెక్నాలజీ, అభివృద్ధి తరహాలో తీసుకొచ్చారు. అప్పట్లో 10 వేల రూపాయలు రద్దు చేసిన నాటి సంఘటన పత్రిక పతాక శీర్షికన ప్రచురితం కావడాన్ని చూస్తే, ఇది ఇప్పటి బ్రేకింగ్ న్యూస్ కానీ, అప్పట్లోనే అది పతాక శీర్షిక అయిందని అర్ధం అవుతుంది.