Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Buddhist monks: కేబుల్‌తో నడిచే రైలు బోల్తా పడింది.. ఏడుగులు బౌద్ధ సన్యాసులు మృతి

Advertiesment
Buddhist monks

సెల్వి

, గురువారం, 25 సెప్టెంబరు 2025 (11:18 IST)
Buddhist monks
వాయువ్య శ్రీలంకలోని ఒక అటవీ మఠం వద్ద కేబుల్‌తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
 
కొలంబో నుండి 125 కి.మీ దూరంలో ఉన్న నికావెరటియాలో ఉన్న ప్రఖ్యాత బౌద్ధ మఠం నా ఉయన అరణ్య సేనసనయలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ మఠం ధ్యాన విహారాలకు ప్రసిద్ధి చెందింది.
 
ప్రపంచవ్యాప్తంగా అభ్యాసకులను ఆకర్షిస్తుంది. మరణించిన ఏడుగురు సన్యాసులలో ఒక భారతీయుడు, ఒక రష్యన్,  ఒక రొమేనియన్ జాతీయుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Man: ఢిల్లీ పట్టపగలే బంగారం దోపిడీ.. కోటి రూపాయలు గోవిందా