Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పకూలిన భార‌త వాయుసేన జెట్ ఫైట‌ర్ విమానం

Advertiesment
కుప్పకూలిన భార‌త వాయుసేన జెట్ ఫైట‌ర్ విమానం
విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (17:44 IST)
వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం నేడు కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఈ ప్ర‌మాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు వాయుసేన పేర్కొంది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కూలినట్లు తెలుస్తోంది.
 
శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్‌ సెక్టార్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. అనంతరం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం తోక భాగం నేలలో కూరుకుపోయి కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వాయుసేన భావిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు వాయుసేన విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అస‌లు మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం త‌నంత‌ట తాను సాంకేతిక లోపంతో కుప్ప‌కూలిందా? మ‌రేదైనా కార‌ణాలున్నాయా అనే దిశ‌లో విచార‌ణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ ధరించకుంటే రూ.1000 అపరాధం.. ఎక్కడ?