పాకిస్థాన్‌కు భారత్ దెబ్బమీద దెబ్బ... మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా రద్దు దిశగా అడుగులు
పాకిస్థాన్‌ను నాలుగు వైపుల నుంచి దెబ్బకొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆయన అంతర్జాతీయ వేదికగా పాక్‌ను ఏకాకిని చేసేలా వ్యూహరచనలు చేస్తున్నారు.
పాకిస్థాన్‌ను నాలుగు వైపుల నుంచి దెబ్బకొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆయన అంతర్జాతీయ వేదికగా పాక్‌ను ఏకాకిని చేసేలా వ్యూహరచనలు చేస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ సెక్టార్‌లో భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. అంటే భారత్‌లో ఉగ్రవాదాన్ని చొప్పిస్తూ ఉగ్రదాడులకు ఉసిగొల్పుతున్న పాక్‌ను గుక్కతిప్పుకోనీయకుండా చేసేందుకు ప్రధాని మోడీ వ్యూహరచనలో తలమునకలై ఉన్నారు.
ఇందులోభాగంగా, భారత్ - పాకిస్థాన్ దేశాల 56 ఏళ్లుగా ఉన్న సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటి) రద్దుపై ఇప్పటికే దృష్టి సారించిన కేంద్రం... తాజాగా ఆ దేశానికి కల్పించిన మిత్రదేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను రద్దు చేసే యోచనలో ఉంది. హోదా రద్దు చేసే విషయాన్ని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29న ఉన్నతాధికారులతో సమావేశం జరుపనున్నారు.
1996లో పాకిస్థాన్‌కు మిత్రదేశం హోదాను భారత్ కల్పించింది. ఇందువల్ల ఇరు దేశాలు సమాన వాణిజ్య ప్రయోజనాలు పొందుతాయి. భారత్ ఇచ్చిన హోదాతో వ్యాపారపరంగా ఇప్పటివరకూ పాక్ ఆర్థికంగా బాగానే ప్రయోజనం పొందింది. మిత్రదేశం హోదా రద్దు చేసినపట్లయితే దౌత్యపరమైన సంబంధాలపై కూడా ఈ ప్రభావం గణనీయంగా పడుతుందన్నది దౌత్యవేత్తల వాదనగా ఉంది. దీంతో ప్రధాని మోడీ ఈ అంశంపై దృష్టిసారించారు.