Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలితకు ఆ భద్రత ఏదీ? సామాన్యులకే కాదు.. మాకూ అనుమానాలున్నాయ్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రజలకే కాదు మాకూ అనుమానాలున్నాయని మద్రాస్‌ హైకోర్టు జస్టిస్‌ ఎస్‌.వైద్యనాథన్‌ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం కోలుకుంటుందని, మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని

Advertiesment
India: Madras high court questions Jayalalitha death cause
, శుక్రవారం, 30 డిశెంబరు 2016 (08:55 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రజలకే కాదు మాకూ అనుమానాలున్నాయని మద్రాస్‌ హైకోర్టు జస్టిస్‌ ఎస్‌.వైద్యనాథన్‌ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం కోలుకుంటుందని, మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని ప్రకటనలు చేసి.. చివరికి చనిపోయారంటూ తెలపడంపై జస్టిస్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సామాన్యులకే కాదు.. తమకూ సందేహాలున్నాయని మద్రాస్‌ హైకోర్టు జస్టిస్‌ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత మృతదేహాన్ని మళ్లీ వెలికి తీయాలని ఎందుకు ఆదేశించకూడదని మౌఖికంగా వ్యాఖ్యానించింది. జయ మృతిపై విచారణ జరపాలని పీఏ జోసెఫ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.వైద్యనాథన్‌, జస్టిస్‌ వి.పార్థీబన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించిన సంగతి తెలిసిందే. 
 
ఈ క్రమంలో జయ ఆరోగ్యంపై గోప్యతను పాటించడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌ అభ్యంతరాలపై స్పందించాల్సిందిగా ప్రధాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
 
ఇదిలా ఉంటే.. జయకు రక్షణ కల్పించడంలో విఫలమైతే కేంద్ర హోంశాఖ విఫలమైనట్లు తెలుస్తోంది. జయ మృతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమెకు జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించిన ఎన్ఎస్ జీ దళం వ్యవహారశైలిపైన, కేంద్రంపైనా సందేహాలు రేగుతున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన సెక్యూరిటీ గార్డుల చేతనే హత్యకు గురైన తర్వాత దేశంలో జాతీయ భద్రతా దళం ఏర్పాటైంది. 
 
ఎన్‌ఎస్‌జీ కమెండోలతో రాజకీయ ప్రముఖులకు, సీఎంలకు, ప్రధాని, మాజీ ప్రధానులకు, ఉగ్రవాదుల వల్ల ప్రాణాపాయమున్న వారికి వై, వై ప్లస్‌, జడ్‌, జడ్‌ ప్లస్‌ కేటగిరీలలో భద్రత కల్పిస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ  దళానికి తెలియకుండా వీవీఐపీలు ఏ ప్రాంతానికీ వెళ్లలేరు. తమిళనాట జయలలిత, కరుణానిధికి మాత్రమే జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంది. జయకు 40 మంది కమెండోలు భద్రత కల్పించేవారు.
 
జయలలితకు 1991 నుంచి ఎన్‌ఎస్ జీ భద్రత కల్పిస్తున్నారు. ఆమెను సెప్టెంబర్‌ 22 రాత్రి అపోలో ఆసుపత్రికి తరలించినప్పుడు... ఆమె వాహనం వెంట ఎన్ఎస్ జీ  దళం లేదు. ఆమె ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికి కమెండోలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి... అంటే సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి కమెండోల జాడ కనిపించలేదు. ఎన్ఎస్‌జీ నియమాల ప్రకారం భద్రత పొందుతున్న వ్యక్తి అస్వస్థతకు గురైనా ఆ వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు తెలియజేయాలి. కానీ ఎన్ఎస్‌జీ ఆమె వెంట లేదు. 
 
సదరు వ్యక్తిని నేరుగా వెళ్లి చూసి, పరిస్థితి గమనించాలి. ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారి ఐసీయూలోకి వెళ్లదలచుకుంటే ఆయనను ఎవరూ అడ్డుకోరాదనే నిబంధన ఉంది. మరి జయకు కాపలా కాస్తున్న ఎన్ఎస్ జీ ప్రధానాధికారి ఐసీయూలో ఆమెను కలుసుకోలేదని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరి జేబుల్లో అమ్మ బొమ్మ కాదు చిన్నమ్మ... 'అమ్మ' దీవెనలు ఉన్నట్లేనా? ఏడాది తిరక్కుండానే అంటూ...