భారత్‌లో కుబేరులు పెరిగిపోయారోచ్.. ఆసియా రీజియన్‌లో భారత్‌కు నాలుగో స్థానం-జపాన్ టాప్
భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచి
భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా దేశం ఉన్నది. ఇక నాలుగో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది.
దీని ప్రకారం 2014లో భారత్‌లో 1.8 లక్షల మంది కుబేరులు వుండగా, ఈ సంఖ్య 2015లో రెండు లక్షలకు పెరిగింది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో కుబేరుల స్థానంలో జపాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆ దేశంలో కుబేరుల సంఖ్య 27 లక్షలకు పైగా ఉందని క్యాప్ జెమీనీ సర్వే తేల్చింది.
జపాన్‌లోకుబేరుల సంపాదన 11.4 శాతం పెరిగి 6,57,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. తరువాత స్థానంలో ఉన్న చైనాలో 10 లక్షలకు పైగా కుబేరులు ఉన్నారు. చైనాలో కుబేరుల సంపద 16.9 శాతం పెరిగి 5,26,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కుబేరుల సంపాదన 1.6 శాతం పెరిగి 79,700 కోట్ల డాలర్లకు చేరుకుందని క్యాప్ జెమినీ నివేదిక పేర్కొంది.