నల్లకుబేరుడు శేఖర్ రెడ్డి అరెస్ట్.. సీఎస్ ఇంట్లో సోదాలు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పన్నీర్ అత్యవసర భేటీ?
నల్ల కుబేరుడు అరెస్టయ్యాడు. చెన్నైకి చెందిన తితిదే బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివ
నల్ల కుబేరుడు అరెస్టయ్యాడు. చెన్నైకి చెందిన తితిదే బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌లను ఇవాళ సీబీఐ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. శేఖర్‌రెడ్డికి జనవరి 3 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవల శేఖర్‌రెడ్డి నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.127 కోట్ల నగదు, 100 కేజీలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామ్మోహన్ రావు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇసుక క్వారీల వ్యాపారం చేసే ప్రముఖ కాంట్రాక్టర్ బాబు శేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డి కారణంగా ఇప్పుడు రామ్మోహన్ రావు పీకలలోతు కష్టాల్లో పడ్డారు. ఐటీ అధికారులు శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రెడ్డి లింకుందంటూ బుధవారం ఉదయం నుంచే ఆయన ఇంటిపై దాడులు చేపట్టారు.
రామ్మోహన్ రావుకు సంబంధించిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. శేఖర్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించడానికి రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు ప్రతిఫలంగా తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో రామ్మోహన్ రావు కుటుంబ సభ్యుల పేర్ల మీద అక్రమ ఆస్తులు రిజిస్టర్ చేయించారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రావును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
మరోవైపు సీఎస్ ఇంట్లో ఐటీ దాడులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చంటూ డీఎంకే కోశాధికారి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో అన్నాడీఎంకే ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్నాడీఎంకే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర సచివాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన చర్చిస్తున్నారు. తమ తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.